AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahabubabad: కామపిశాచిలా మారిన మామ.. కోడలిపైనే కన్ను.. మాట వినకపోవడంతో

సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. మనుషులు ట్రాక్ తప్పుతున్నారు. వావి వరసలు మరిచి.. జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.

Mahabubabad: కామపిశాచిలా మారిన మామ.. కోడలిపైనే కన్ను.. మాట వినకపోవడంతో
Murder
Ram Naramaneni
|

Updated on: Jan 06, 2022 | 5:11 PM

Share

సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. మనుషులు ట్రాక్ తప్పుతున్నారు. వావి వరసలు మరిచి.. జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. కామపిశాచుల్లా మారి.. విపరీత పనులకు పూనుకుంటున్నారు. తాజాగా ఓ మామ కోడలిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. లైంగిక కోరిక తీర్చాలన్న తన కోరికను తిరస్కరిస్తుండటంతో ఆ ప్రబుద్దుడు హత్య చేశాడు. ఆ తరువాత నేరుగా వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మహబూబాబాద్‌ జిల్లా సోమ్లాతండాలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కురవి మండలంలోని జుజూర్‌ తండాకు చెందిన బోడ చంద్రు కుమార్తె రజిత (30)ను 12 ఏళ్ల క్రితం సోమ్లాతండాకు చెందిన భూక్యా హచ్చ తనయుడైన సంతోష్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ముత్యాలమ్మగూడెంలోని గురుకులంలో చదువుకుంటున్నారు. అయితే  63 ఏళ్ల వయసు ఉన్న మామ భూక్యా హచ్చా కామ వాంఛలతో రగిలిపోయాడు. కోడలు రజితను తన కోరిక తీర్చాలని మూడేళ్లుగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని రజిత పెద్దలకు చెప్పగా వారు పలుమార్లు హచ్చను మందలించారు. దీంతో రజితపై కక్ష పెంచుకున్న హచ్చ, బధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రజిత తలపై రాడ్డుతో గట్టిగా బాదాడు. ఆ తరువాత క్రూరంగా కత్తితో గొంతు కోసి, కడుపులో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత నేరుగా పీఎస్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతురాలి తండ్రి చంద్రు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రజిత హత్య విషయం తెలుసుకున్న బంధువులు ఆగ్రహంతో సోమ్లాతండాకు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.  పోలీసులు మృతదేహాన్ని బలవంతంగా ట్రాక్టర్‌లో వేసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోటకు తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో తండాలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు.

Also Read: Suryapet: భార్యతో వివాహేతర సంబంధం! కోపం పట్టలేక.. దమ్ము చక్రాలతో నుజ్జునుజ్జుగా తొక్కించాడు..

అనుమానాస్పదంగా కనిపించిన పార్శిల్ బాక్స్‌లు.. తెరిచి చూసిన అధికారులు షాక్

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..