Andhra Pradesh: ప్రియుడు తో బెడ్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి అడ్డొచ్చిన భర్తను కిరాతకంగా హత్య చేసిందో కసాయి భార్య.. తండ్రి మృతి, కటకటాల పాలయ్యిన తల్లి.. ఆలనా పాలన చూసే ఇద్దరూ లేక ఇద్దరు చిన్నారులు రోడ్డునపడ్డ హృదయ విధార ఘటన ఇప్పుడు విజయనగరం జిల్లా(Vijayanagara District)లో సంచలనంగా మారింది.. బొబ్బిలి మండలం పారాదిలో కలిశెట్టి వెంకట రమణకు రామభద్రపురం మండలం కొండపాలవలస కు చెందిన లలిత అనే మహిళతో 2015 లో పెళ్లైంది.. కొన్నాళ్ళు వీరి మధ్య సంసారం అనోన్య0గానే సాగింది.. వీరికి ఐదేళ్ల బాబు, పద్దెనిమిది నెలల పాప ఉన్నారు.. పిల్లపాపలతో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న వీరి కుటుంబంలో అదే గ్రామానికి చెందిన నరసింగరావు అనే యువకుడు ఎంటర్ అయ్యాడు.. వెంకటరమణ తో నరసింగరావుకు ఉన్న పరిచయంతో లలిత తో మాటలు కలిపాడు.. అది కాస్తా లలిత, నరసింగరావుల మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.. ఒకే గ్రామం కావటంతో తరుచూ వీరిద్దరూ కలుస్తుండేవారు.. ఇదే విషయం పై భర్త వెంకటరమణ భార్య తో తరుచూ గొడవ పడుతుండేవాడు.
ఈ నేపథ్యంలోనే ఒకరోజు ప్రియుడుతో ఉన్న భార్యను చూసి చేసేదిలేక భార్యను పుట్టింటికి పంపాడు వెంకటరమణ.. కొద్ది నెలల తరువాత ఇద్దరు పిల్లలు ఉండటంతో గ్రామ పెద్దలు మధ్యవర్తిత్వం చేసి భార్యాభర్తలను మళ్లీ కలిపారు.. అలా పెద్దమనస్సుతో భర్త తిరిగి కాపురానికి ఒప్పుకున్నా భార్య ప్రవర్తనలో మాత్రం ఏ మాత్రం మార్పు రాలేదు.. ఎప్పటిలాగే ప్రియుడు నరసింగరావు తో తన అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది.. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10 వతేదీ న అర్ధరాత్రి ప్రియుడు నరసింగరావు తో కలిసి లలిత సహజీవనం చేస్తుండగా గమనించిన భర్త వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు.. దింతో ఇద్దరూ కలిసి చున్నీతో మెడకు బిగించి చంపేశారు. భర్త చనిపోయాడని కన్ఫమ్ చేసుకున్నాక తన భర్త సోదరుడు అయిన అప్పలనాయుడు ఇంటికి వెళ్లి, గుండె నొప్పి అని చెప్పి రెండు మాత్రలు వేసుకొని పడుకున్నాడని, ఎంత లేపినా లేవడం లేదంటూ ఏడుస్తూ చెప్పింది. నిజమేనని భావించి వెళ్లి తన తమ్ముడిని చూసిన సోదరుడికి మృతుడి ఒంటి పై ఉన్న గాయాలు కనిపించాయి.. దింతో భార్య లలితే తన తమ్ముడుని చంపేసి ఉంటుందన్న అనుమానంతో బొబ్బిలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.. మరోవైపు వెంకరమణ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించేందుకు భార్య, భార్య కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసి రెడీ అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహం తరలింపును అడ్డుకొని నరసి0గరావుతో పాటు లలిత ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో దర్యాప్తు జరపగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. కట్టుకున్న భార్యే తన భర్తను హత్య చేయడం చూసి గ్రామస్తులంతా షాక్ కు గురయ్యారు. అందరితో ఎంతో మంచిగా ఉండే కలిశెట్టి వెంకటరమణ ను హత్య చేసిన భార్య లలితకుమారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మరోవైపు తండ్రి మృతి చెంది తల్లి కటకటాల పాలవ్వటంతో ఇద్దరు చిన్నారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.. చిన్నారులను చూసిన వారి మనస్సు తరుక్కుపోతుంది.
Reporter: Koteswararao
Also Read: