గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఇంజనీరింగ్ విద్యార్థులు

కృష్ణా జిల్లాలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచికచర్ల మండలం దొనబండ లో గంజాయిని తరలిస్తున్న నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి పది కేజీల గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఇంజనీరింగ్ విద్యార్థులు
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 29, 2020 | 11:18 PM

కృష్ణా జిల్లాలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచికచర్ల మండలం దొనబండ లో గంజాయిని తరలిస్తున్న నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి పది కేజీల గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. హైదరాబాద్ కు చెందిన బుర్ర కృష్ణమోహన్ మంగళగిరి కి చెందిన సత్తుపల్లి గోపి, సికింద్రాబాద్ కు చెందిన కొల్లి భరత్ రెడ్డి, బెంగళూరుకు చెందిన షమీనా జోసఫ్ నలుగురు కంచికచర్ల మండలం దొనబండలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ విద్యార్థులు గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నారని నందిగామ డిఎస్పీ జి.వి.రమణమూర్తి వెల్లడించారు. చింతపల్లి కి చెందిన బేస్ అనే వ్యక్తి గంజాయి అక్రమ రవాణాకు సూత్రధారి అని, ఇతను ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపిన డీఎస్పీ.. అతని కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పట్టుబడిన నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని డి.ఎస్.పి రమణ మూర్తి తెలిపారు.