Viral Video: పార్కు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు.. వైరలైన వీడియో
ఈ మధ్య వాహనాల్లో మంటలు రావటం కామన్‌గా మారింది. బుధవారం తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద ఓ కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది...
ఈ మధ్య వాహనాల్లో మంటలు రావటం కామన్‌గా మారింది. బుధవారం తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద ఓ కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు గూడూరు టోల్ ప్లాజా వద్దకు రాగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు కారు దిగి దూరంగా వెళ్లారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తమిళనాడు రాజధాని చెన్నైలో నడి రోడ్డుపైనే ప్రభుత్వ బస్సు తగలబడిపోయింది. బస్సులో మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు.. వెంటనే బస్సు నుంచి కిందకు దిగేశారు.
తాజాగా రోడ్డు పక్కన పార్కు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లో అకస్మాతుగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టు పక్కల ఉన్నవారు అప్రమత్తమై అక్కడి నుంచి దూరంగా వెళ్లారు. ధైర్యం చేసిన కొంత మంది మంటలు అర్పడానికి ప్రయత్నించారు. ఈ ఘటనను వీడియోను తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ మారింది. అయితే ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీసారనేది తెలియరాలేదు. వాహనాల్లో మంటలు రావటంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాహనాలను ఆపకుండా ఎక్కువ దూరం డ్రైవ్ చేయడం.. మెయింటనెన్స్ సరిగ్గాలేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.
Buy a E Scooter and suffer pic.twitter.com/OGX6CxMmMb
— Patrao (@in_patrao) September 29, 2021
Read Also.. ప్రియుడి మోసం.. సూసైడ్ చేసుకున్న టాలీవుడ్ యువనటి.. కుళ్లిన స్థితిలో మృతదేహం…