AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిడ్డలను చంపిన తల్లికి 120ఏళ్ల జైలు శిక్ష

అతి దారుణంగా కన్నబిడ్డలను కడతేర్చిన ఓ తల్లికి అమెరికా న్యాయస్థానం కఠిన శిక్షను విధించింది. ఇద్దరు పిల్లలను హత్య చేసినందుకుగానూ 60ఏళ్ల చొప్పున 120ఏళ్ల వరకు పెరోల్‌ సాధ్యం కాని విధంగా జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. ఈస్ట్‌ హెవెన్ ప్రాంతానికి చెందిన లి రోయా మూరే 2015లో కుమార్తె అలీషా, కుమారుడు డారన్‌ను హత్య చేసింది. ఆ తరువాత ఆ మృతదేహాలను ఇంట్లోనే పెట్టుకొని, మూడు రోజులు గడిపింది. అయితే ఆమె ఇంటి నుంచి […]

బిడ్డలను చంపిన తల్లికి 120ఏళ్ల జైలు శిక్ష
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 28, 2019 | 2:16 PM

Share

అతి దారుణంగా కన్నబిడ్డలను కడతేర్చిన ఓ తల్లికి అమెరికా న్యాయస్థానం కఠిన శిక్షను విధించింది. ఇద్దరు పిల్లలను హత్య చేసినందుకుగానూ 60ఏళ్ల చొప్పున 120ఏళ్ల వరకు పెరోల్‌ సాధ్యం కాని విధంగా జైలు శిక్ష విధించింది.

వివరాల్లోకి వెళ్తే.. ఈస్ట్‌ హెవెన్ ప్రాంతానికి చెందిన లి రోయా మూరే 2015లో కుమార్తె అలీషా, కుమారుడు డారన్‌ను హత్య చేసింది. ఆ తరువాత ఆ మృతదేహాలను ఇంట్లోనే పెట్టుకొని, మూడు రోజులు గడిపింది. అయితే ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హత్యల విషయం స్థానికులకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ హత్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టి మూరేను అరెస్ట్‌ చేశారు.

ఇదిలా ఉంటే దేవుడు చెబితేనే తన పిల్లలను చంపానని మూరే విచారణలో చెప్పింది. వారిని మళ్లీ బతికించుకునేందుకే మృతదేహాలను ఇంట్లో ఉంచుకున్నట్లు తెలిపింది. ఇక ఈ కేసు విచారణ ఈ ఏడాది మార్చిలో పూర్తి కాగా.. గురువారం న్యూహెవెన్ కోర్టు తుది తీర్పును వెల్లడించింది. ఇది చాలా తీవ్రమైన ఘటన అని.. దోషికి శిక్ష పడాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేస్తూ.. 120ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.

Follow Us
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే
పోలీస్ స్టేషన్‌లోనే పొల్లు పొల్లు కొట్టుకున్నారు మావ.. వీడియో
పోలీస్ స్టేషన్‌లోనే పొల్లు పొల్లు కొట్టుకున్నారు మావ.. వీడియో
తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తుకు సంకేతమా?
తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తుకు సంకేతమా?
ఐపీఎల్ పై యుద్ధ నీడలు..గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ ?
ఐపీఎల్ పై యుద్ధ నీడలు..గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ ?
ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతున్నారా?
ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతున్నారా?