దిశ నిందితులు గతంలో.. ఏకంగా 9 మందిని రేప్ చేసి..?

వెటర్నరీ డాక్టర్ దిశ నిందితుల కేసులో ఒక్కొక్కటిగా సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి. ప్రధాన నిందితులైన మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, జొల్లు శివ. జొల్లు నవీన్‌లకు గతంలో నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా వారి నేరాల చిట్టా ‘దండుపాళ్యం’ బ్యాచ్‌ మాదిరిగా దడ పుట్టిస్తోంది. డాక్టర్ దిశ మాదిరిగానే గతంలో మరో 9 మందిని అత్యాచారం చేసి.. ఆపై సజీవ దహనం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యల వెనుక ఆరిఫ్, చెన్నకేశవుల హస్తం ఉందని […]

దిశ నిందితులు గతంలో.. ఏకంగా 9 మందిని రేప్ చేసి..?
Ravi Kiran

|

Dec 18, 2019 | 3:43 PM

వెటర్నరీ డాక్టర్ దిశ నిందితుల కేసులో ఒక్కొక్కటిగా సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి. ప్రధాన నిందితులైన మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, జొల్లు శివ. జొల్లు నవీన్‌లకు గతంలో నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా వారి నేరాల చిట్టా ‘దండుపాళ్యం’ బ్యాచ్‌ మాదిరిగా దడ పుట్టిస్తోంది.

డాక్టర్ దిశ మాదిరిగానే గతంలో మరో 9 మందిని అత్యాచారం చేసి.. ఆపై సజీవ దహనం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యల వెనుక ఆరిఫ్, చెన్నకేశవుల హస్తం ఉందని అనుమానులు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్ నగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, కర్ణాటక, హైదరాబాద్ హైవేలపై ఈ దారుణాలకు నిందితులు ఒడిగట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇదిలా ఉండగా పోలీసులు హైవేల పక్కన జరిగిన హత్యలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే హత్య చేసి కాల్చేసిన 15 మృతదేహాలను వారు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక ఈ 15 మర్డర్ కేసుల్లో డీఎన్‌ఏ రిపోర్టులను పోలీసులు పరిశీలిస్తున్నారు. 4 ప్రత్యేక బృందాలతో నిందితుల డీఎన్‌ఏతో ఈ కేసుల మిస్టరీని ఛేదించే పనిలో సైబరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు. దిశ కేసులో ఛార్జ్ షీట్ వేసే సమయానికి వీటిని ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు. కాగా, డిసెంబర్ 6వ తేదీన పోలీసులు చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu