దిక్కుమాలిన పబ్‌జీ కోసం పిల్లోడు ఎంత పని చేశాడంటే…!

దిక్కుమాలిన పబ్‌జీ గేమ్‌ ఎంత మంది ఉసురు తీసుకున్నదో కదా! మరెంత మంది జీవితాలతో ఆటలాడుకున్నదో కదా! పబ్‌జీ అన్నదే ఓ దుర్వ్యసనం.. అందుకే నరేంద్రమోదీ ప్రభుత్వం బ్యాన్‌ చేసి పారేసింది..!

దిక్కుమాలిన పబ్‌జీ కోసం పిల్లోడు ఎంత పని చేశాడంటే...!
Follow us
Balu

|

Updated on: Sep 08, 2020 | 3:55 PM

దిక్కుమాలిన పబ్‌జీ గేమ్‌ ఎంత మంది ఉసురు తీసుకున్నదో కదా! మరెంత మంది జీవితాలతో ఆటలాడుకున్నదో కదా! పబ్‌జీ అన్నదే ఓ దుర్వ్యసనం.. అందుకే నరేంద్రమోదీ ప్రభుత్వం బ్యాన్‌ చేసి పారేసింది..! బ్యాన్‌ చేసినా ఈ గేమ్‌ ఇంకా అందుబాటులో ఉంటోంది.. ఇంకా తెగ ఆడేస్తున్నారు.. ఇక ఢిల్లీలో ఓ పిల్లోడు పబ్‌జీ కోసమే తన తాత పెన్షన్‌ ఖాతా నుంచి డబ్బులు లాగేసుకున్నాడు.. పదో పరకో అంటే వదిలేయొచ్చు.. రెండు లక్షలా 35 వేల రూపాయలను ఆ పిల్లోడు తాత అకౌంట్‌ నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నాడంటే .. పబ్‌జీ ఎంత దరిద్రపుగొట్టు ఆటో అర్థమవుతుంది.. ఆ బాలుడు తన తాత పెన్షన్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు బదిలీ చేసిన సంగతిని ఢిల్లీ సైబర్‌ పోలీసు సెల్‌ విభాగం కనిపెట్టింది.. ఆ విషయాన్నే పది మందికి చెప్పింది.. కొన్ని రోజుల కిందట తన బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రెండున్నర వేల రూపాయలు డ్రా అయ్యిందని బాధితుడికి మెసేజ్‌ రావడంతో బిత్తరపోయాడు.. పైగా బ్యాలెన్స్‌ 275 రూపాయలే అని చెప్పడంతో కంగారెత్తిపోయాడు.. వెంటనే బ్యాంకుకు పరుగెత్తుకెళ్లాడు.. తనకొచ్చిన సందేశాన్ని బ్యాంక్‌ అధికారులకు చూపించాడు.. వారు డాటా తీయడంతో పెన్షన్‌ ఖాతా నుంచి రెండు లక్షల 34 వేల రూపాయలు బదిలీ అయినట్లు తెలిసింది.

బాధితుడు అట్నుంచి అటే పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు.. విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. తను ఎలాంటి లావాదేవీలు చేయలేదన్నాడు.. పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.. పంజక్‌ కుమార్‌ పేరిట ఉన్న పేటీఎం ఖాతాకు డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అవుతున్నట్టు తెలుసుకున్నారు.. వెంటనే పంకజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విషయాలు రాబట్టారు పోలీసులు. తన ఫ్రెండ్స్‌లో ఒకరు తన ఐడీ, పేటిఎం అకౌంట్‌ పాస్‌వర్డ్‌ అడిగినట్టు అతగాడు చెప్పుకొచ్చాడు.. ఆ ఫ్రెండ్‌ పబ్‌జీ కోసం గూగుల్‌ పే చెల్లింపులు చేయడానికి పంకజ్ ఖాతాను ఉపయోగించినట్లు పోలీసులు కనుగొన్నారు. ఆ తర్వాత అతడెవరని ఎంక్వైరీ చేస్తే బాధితుడి మనవడని తేలింది.. తన తాత ఖాతా నుంచి పబ్‌జీ ఆడటానికి నగదు బదిలీ చేసినట్లు పోలీసుల విచారణలో ఆ పిల్లోడు ఒప్పుకున్నాడు. బ్యాంక్ ఖాతా హ్యాకింగ్ అవుతుందని చెప్పి తన తాత మొబైల్ ఫోన్ నుంచి ఓటీపీ మెసేజ్‌లను తొలగించేవాడట!