విశాఖలో వింతదొంగ..అర్ధరాత్రి నగ్నంగా..
విశాఖను దిగంబర దొంగ వణికిస్తున్నాడు. ఒంటిపై బట్టల్లేకుండానే ఇళ్లల్లోకి చొరబడుతూ.. చోరీలకు పాల్పడుతన్నాడు. మర్రిపాలెం ఉడా... లే అవుట్‌లో ఒకే రోజు నాలుగు ఇళ్లల్లో చోరీలు చేసి కలకలం రేపాడు.
విశాఖను దిగంబర దొంగ వణికిస్తున్నాడు. ఒంటిపై బట్టల్లేకుండానే ఇళ్లల్లోకి చొరబడుతూ.. చోరీలకు పాల్పడుతన్నాడు. మర్రిపాలెం ఉడా… లే అవుట్‌లో ఒకే రోజు నాలుగు ఇళ్లల్లో చోరీలు చేసి కలకలం రేపాడు. ఇటీవల ఓ వ్యాపారి ఇంట్లో దొంగతనానికి వచ్చినప్పుడు ఈ తతంగం అంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
విశాఖపట్నం మర్రిపాలెం ఉడా లే అవుట్‌లో ఆదివారం అర్ధరాత్రి ఓ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తి వెనుక గేటు నుంచి లోపలికి ప్రవేశించాడు. ఒడ్డుపొడుగు, బలంగా ఉన్న ఆ వ్యక్తికి ఒంటిపై నూలుపోగు కూడా లేదు. అతడు ఇళ్లంతా తిరగడం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. సీసీ కెమెరాల్లో నమోదైన ఈ నగ్న దొంగ ఇళ్లలోకి చొరబడుతున్న దృశ్యాలు చూసి జనం అవాక్కయ్యారు. ఒంటి మీద బట్టలు లేకుండా.. చేతులకు మాత్రమే గ్లౌజులు వేసుకుని.. ఇళ్లపై పడుతున్నాడు ఈ మాయదారి నగ్న దొంగ.