Police Constable Dies by Suicide: హైకోర్టు వద్ద డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్‌తో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో కలకలం సృష్టించింది. హైకోర్టు వద్ద ఓ పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం 10:15 గంటలకు గేట్ నంబర్ -3 వద్ద కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్‌తో తనకు తాను కాల్చుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ రాజస్థాన్ బెటాలియన్‌కు చెందిన టింకూరామ్‌గా పోలీసులు గుర్తించారు. సెలవుల తర్వాత కానిస్టేబుల్ టింకూరామ్ ఈ రోజే విధుల్లో చేరాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే టింకూరామ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన దేశ రాజధానిలో కలకలం సృష్టించింది.
One Police Constable allegedly died by suicide by shooting himself with his service rifle. He had come for duty this morning and was stationed near Gate number 3 of Delhi High Court: Delhi Police
— ANI (@ANI) September 29, 2021
Also Read: