దారుణం.. అత్తగారు సెల్‌ఫోన్‌ లాక్కుందని ఇద్దరు పిల్లలను బావిలోకి తోసిన కోడలు.. తర్వాత ఏం చేసిందంటే..?

Crime News: మద్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అత్తగారు సెల్‌ఫోన్‌ లాక్కుందని కోడలు తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి తాను ఆత్మహత్య

దారుణం.. అత్తగారు సెల్‌ఫోన్‌ లాక్కుందని ఇద్దరు పిల్లలను బావిలోకి తోసిన కోడలు.. తర్వాత ఏం చేసిందంటే..?
Family Suicide
Follow us
uppula Raju

|

Updated on: Aug 30, 2021 | 3:13 PM

Crime News: మద్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అత్తగారు సెల్‌ఫోన్‌ లాక్కుందని కోడలు తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక సంఘటన ఛతర్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వ గ్రామానికి చెందిన రాణి యాదవ్‌, కన్హయ్య యాదవ్‌ దంపతులు. అయితే శనివారం రాణి యాదవ్‌కి ఆమె అత్తగారితో గొడవ జరిగింది.

ఆ సమయంలో మహిళ భర్త ఇంట్లో లేడు. కోపంతో అత్తగారు.. కోడలు మొబైల్‌ని లాక్కొని తన వద్ద ఉంచుకుంది. ఇది రాణి యాదవ్‌కి కోపం తెప్పించింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకరి వయసు 10 సంవత్సరాలు కాగా మరొకరి వయసు 4 సంవత్సరాలు. అత్తగారు చేసిన పనికి కోపంతో ఊగిపోతున్న కోడలు అభం శుభం తెలియని ఇద్దరు కూతుళ్లను బావిలోకి తోసింది. అనంతరం ఆమె ఇంట్లోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఈ సంఘటనలో 10 ఏళ్ల కుమార్తె మరణించగా, 4 ఏళ్ల బాలిక బావిలో ఉండే చెట్లమధ్య చిక్కుకొని గాయాలతో బయటపడింది. అయితే చిన్నపిల్లల ఏడుపు వినిపించడంతో అటుగా వెళుతున్న స్థానికులు బావిలోకి తొంగి చూసి పాపను కనుగొన్నారు. ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక ప్రజల సహాయంతో మరో కూతురు మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీశారు. రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పంపించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Krishnashtami 2021: కృష్ణాష్టమి సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు చెప్పిన మహేష్, పూజా హెడ్గే, కాజల్, రకుల్

Driving License at Home: ఇంట్లో కూర్చొని మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోండి..అది ఎలానో జస్ట్ ఇలా చేయండి.. అంతే..

Maestro Sneak Peak: కృష్ణాష్టమి రోజున మాస్ట్రో సర్‏ప్రైజ్.. అంధుడిగా ఆకట్టుకుంటున్న నితిన్..