Crore Rupees Fraud: రైతుల పేరుతో నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ పాస్ పుస్తకాలతో సొసైటీల్లో కోట్ల రూపాయల గోల్ మాల్..

|

Mar 12, 2022 | 12:58 PM

Crore Rupees Fraud: గుంటూరు జిల్లా(Guntur District)లో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచ్ (cooperative central bank) పరిధిలో ఉండే సొసైటీల్లో అక్రమార్కులు చేతి వాటం ప్రదర్శించారు. గత కొంత కాలంగా వివిధ సొసైటీల్లో ..

Crore Rupees Fraud: రైతుల పేరుతో నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ పాస్ పుస్తకాలతో సొసైటీల్లో కోట్ల రూపాయల గోల్ మాల్..
Gdcc Bank
Follow us on

Crore Rupees Fraud: గుంటూరు జిల్లా(Guntur District)లో  జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచ్(cooperative central bank) పరిధిలో ఉండే సొసైటీల్లో అక్రమార్కులు చేతి వాటం ప్రదర్శించారు. గత కొంత కాలంగా వివిధ సొసైటీల్లో నకిలీ పాస్ పుస్తకాలు(Fake pass books), నకిలీ ఆధార్ కార్డులు(Fake Adhar Cards) సృష్టించి కోట్ల రూపాయల రుణాలు పొందారు. జిడిసిసిబి బ్యాంక్ పరిధిలో ఉండే ప్రాధమిక సహకార సంఘాల్లో రైతులకు రుణాలిస్తారు. ఈ రుణాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి స్వల్ప కాలిక రుణాలు అనగా పంట రుణాలిస్తారు. మిర్చి, ప్రత్తితో పాటు వివిధ పంటలు సాగు చేసుకునే రైతులకు ఈ రుణాలిస్తారు. ఏడాదిలోపు ఈ రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు రైతులుకున్న పొలాలను తాకట్టు పెట్టుకొని దీర్ఘ కాలిక రుణాలిస్తారు. పొలం రిజిస్ట్రేషన్ విలువలో ఎనభై శాతం వరకూ రుణాలిస్తారు. అయితే ఈ రుణాలను ఆయా సొసైటీ, జిడిసిసిబి బ్రాంచ్్ల పరిధిలో ఉన్న రైతులకు పొలం ఎక్కడున్న సరే ఇస్తారు. దీన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది ఇతర ప్రాంతాల్లో తమకు పొలం ఉన్నట్లు చూపించి రుణాలు పొందారు. తాజాగా మాచవరం మండలం మాచవరం, తాడుట్లలో తమకు పొలాలున్నాయని నమ్మించి కాకుమాను సొసైటీ పరిధిలో పదకొండు మంది 76 లక్షల రూపాయల మేర రుణాలు పొందారు.

కాకుమాను మండలం గరికపాడు, బీకేపాలెం, కాకుమాను గ్రామాల్లో ఉంటున్నట్లు నకిలీ ఆధార్్ కార్డులు సృష్టించారు. వీరికి పొలాలు మాచవరం మండలంలోని మాచవరం, తాడుట్ల గ్రామాల్లో ఉన్నట్లు నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేశారు. వీటిని కాకుమాను సొసైటీలో తాకట్టు పెట్టి ఒక్కొక్కరు ఏడు లక్షల రూపాయల రుణాలు పొందారు. గత కొంతకాలంగా ఈ తరహా మోసాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి.

ఇప్పటికే ప్రత్తిపాడు, కాకుమాను, ఫిరంగిపురం, పెదనంది పాడు సొసైటీల్లో అక్రమాలు జరిగాయి. దీనిపై పెద్ద ఎత్తున్న జిడిసిసిబి బ్యాంక్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వివిధ సొసైటీల్లో మాచవరం పేరుతో భూములు తనఖా పెట్టి రుణాలు పొందిన వారి పేర్లు నిజమైనవేనా, పాస్ పుస్తకాలు నిజమా కాదా అన్న అంశాలను ఆయా సొసైటీలు నిర్ధారించుకుంటున్నాయి. ఉండవల్లి, తుళ్లూరు సొసైటీల్లోనూ మాచవరంలో భూములున్నట్లు కొందరూ రుణాలు పొందారు. ఆ రుణాలు పొందిన వారి వివరాలను మాచవరం తహశీల్ధారుకు పంపి వారికి భూములున్నాయా లేదా అన్న అంశాలను చెప్పాలని సొసైటీ అధికారులు లేఖ రాశారు.

గత కొంతకాలంగా వెలుగు చూస్తున్న అంశాలతో రెవిన్యూ అధికారులు, సొసైటీ అధికారులు అవాక్కవుతున్నారు. ఇప్పటికైనా సొసైటీల రుణాలపై పూర్తి స్తాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని లేకుంటే నిజమైన రైతులకు రుణాలు అందే అవకాశం లేదంటున్నారు. వివిధ పేర్లతో రుణాలు పొందిన వారి వెనుక బలమైన నేతలు ఉన్నారా లేదా అన్న అంశాన్ని తేల్చాలంటున్నారు. బోగస్ పేర్లతో రుణాలు పొందిన వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని రైతులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Reporter: T Nagaraju, Tv9 telugu, Guntur

Also Read: 

ల్యాప్ టాప్‌లో నిమగ్నమైన వ్యక్తి.. వెనుక విషపూరితమైన పులి పాము.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో వైరల్

తెలంగాణ – ఏపీలో సేమ్ పొలిటికల్ సీన్.. తొడలుకొట్టి మీసాలు మెలేస్తున్న లీడర్స్.. అప్పుడే ఎందుకీ దూకుడు?

మీ కళ్లకి ఒక పరీక్ష.. ఈ ఫొటోలో దాగి ఉన్న సంఖ్యని కనుక్కుంటే మీరు తోపే.. అన్నట్లు అందులోనే ఒక క్లూ కూడా ఉందండోయ్‌..