Real Estate Murder: సంగారెడ్డిలో దారుణం.. రియల్టర్‌ దారుణ హత్య.. తల, మొండెం వేరు చేసిన దుండగులు..!

Real Estate Murder: రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. రియల్టర్‌ కడవత్‌ రాజు (32)దారుణ హత్యకు గురయ్యారు. సంగారెడ్డి..

Real Estate Murder: సంగారెడ్డిలో దారుణం.. రియల్టర్‌ దారుణ హత్య.. తల, మొండెం వేరు చేసిన దుండగులు..!

Edited By: Anil kumar poka

Updated on: Jan 30, 2022 | 8:54 AM

Real Estate Murder: రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. రియల్టర్‌ కడవత్‌ రాజు (32)దారుణ హత్యకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్‌ దగ్గ మృతదేహం లభ్యమైంది. రాజును హత్య చేసిన దుండగులు తల, మొండెం వేరు చేశారు. కాగా, ఈనెల 26 తెల్లాపూర్‌లో రాజు అదృశ్యం అయ్యాడు. దీంతో బీడీఎల్‌ పోలీసు స్టేషన్‌లో అదృశ్యం కింద కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. హత్యకు గురైనట్లు గుర్తించారు. రియల్‌ ఎస్టేట్‌ గొడవలే రాజు హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇంద్రకర్‌ పరిసర ప్రాంతాల్లో హత్య చేసి తల భాగాన్ని రాయికోడ్‌ మండలంలోని కుకునూరు గ్రామ పరిసరాల్లో లభ్యమైంది. మొండెం పుల్కల్‌ మండలం సింగూరు ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ వద్ద నీటిలో లభ్యమైంద. రెండింటిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు.

రియల్ ఎస్టేట్ లావాదేవీల కారణంగానే కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత కక్షలే హత్యకు కారణమని భావిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కడవత్‌ రాజు బంధువులను సైతం విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Hyderabad: తగ్గేదేలే అంటున్న స్పెషల్ టాస్క్‌ఫోర్స్.. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం..

MLA Car Accident: గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కారును ఢీకొన్న మరో కారు..