Chittoor Police Chased Murder: కాలం మారే కొద్ది మనుషులు కసాయిల్లా మారుతున్నారు. రక్తసంబంధీకులనే కాదనుకుంటున్నారు. డబ్బుల కోసం వేధిస్తున్నాడని, ఓ తండ్రి కన్నకొడుకునే హత్య చేయించాడు. చిత్తూరు జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసం కన్న కొడుకు గిరిబాబు వేధిస్తున్నాడన్న నెపంతో తండ్రి జయరామ్ సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు.
ఈనెల 17న చిత్తూరు జిల్లాలోని కేవీ పల్లి మండలం రెడ్డివారిపల్లిలో గిరిబాబు అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు కొడవళ్లతో నరికి చంపారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం చేపట్టిన అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణ చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కన్న తండ్రి జయరామ్‌నే నిందితుడిగా తేల్చారు. తండ్రి జయరామ్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం వెలుగుచూసింది. కాగా, కొడుకు గిరిబాబును తానే హత్య చేయించినట్లు కసాయి తండ్రి అంగీకరించాడు. కొడుకు హత్య చేసేందుకు కిరాయి హంతకులతో తండ్రి జయరామ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందుకోసం మర్డర్ గ్యాంగ్‌కు రూ. 9 లక్షల సుపారీ ఇచ్చినట్లు తెలిపారు. కాగా, జయరాంతో పాటు సూపరీ హత్యలో నిందితుడైన మల్లికార్జున, చంద్రశేఖర్, వడ్డీ సురేష్ తో పాటు నలుగుర్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు.
రష్యన్ నటి అలెగ్జాండ్రా జావి మృతిపై గోవా పోలీసుల దర్యాప్తు.. రష్యా కాన్సులేట్ అనుమతికై ఎదురుచూపులు