Anantapur Crime News: సూటు, బూటులో నాటుగాడు… గోల్డ్ షాపుకు వచ్చి కియా కంపెనీ ఓనర్‌ను అన్నాడు.. కట్ చేస్తే..

| Edited By: Ram Naramaneni

Jul 10, 2021 | 3:55 PM

అసలే కరోనా సమయం.. అందునా ఆషాడమాసం కూడా దగ్గరకు వచ్చింది.. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. దీంతో  బంగారం కొనే నాథుడు లేక తెలుగు....

Anantapur Crime News: సూటు, బూటులో నాటుగాడు... గోల్డ్ షాపుకు వచ్చి కియా కంపెనీ ఓనర్‌ను అన్నాడు.. కట్ చేస్తే..
Gold Chain Thief
Follow us on

అసలే కరోనా సమయం.. అందునా ఆషాడమాసం కూడా దగ్గరకు వచ్చింది.. ప్రజంట్ పెళ్లిళ్లు, ఫంక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. దీంతో  బంగారం కొనే నాథుడు లేక తెలుగు రాష్ట్రాల్లోని జ్యువెలరీ షాపులు వెలవెలబోతున్నాయి.  అనంతపురంలో ఉన్న ఒక జ్యువెలరీ షాపు కూడా అదే పరిస్థితిని ఫేస్ చేస్తోంది.  ఈ క్రమంలో ఇటీవల ఆ షాపులోకి ఎంట్రీ ఇచ్చాడో వ్యక్తి. చూడ్డానికి చదువుకున్నవాడిలా కనిపించాడు.  గోల్డు చైన్లు ఉంటే చూపించమన్నాడు. యాభై- అరవై వేల రేంజ్ లో అతగాడు అడిగిన గోల్డ్ చైన్లు చూపించాడు షాప్ ఓనర్. అన్నిటినీ చూసి.. యాభై నాలుగు వేల రూపాయల విలువ చేసే గోల్డ్ చైన్ సెలెక్ట్ చేశాడు వచ్చిన వ్యక్తి. మాటల మధ్యలో ఓ చిన్న ట్రిక్ ప్లే చేశాడు. తాను అనంతపురంలోని కియా కార్ కంపెనీలో మేనేజర్నని నమ్మబలికాడు. ఆ కంత్రీ కస్టమర్ మాటలను ఇట్టే నమ్మేశాడు జ్యువెలరీ షాప్ ఓనర్. ఇదిగో ఏటీఎంలో డబ్బులు తెస్తానని చైన్ తో సహా ఉడాయిస్తుంటే చూస్తూ ఊరకుండి పోయాడు.

ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడని ఎంత ఎదురు చూసినా రాడే. కాసేపటికి విషయం అర్ధమైంది. ఇతడి బురిడీ మాటలకు తాను బోల్తాకొట్టాననీ.. 54 వేల రూపాయల బ్యాంగ్ పడిందని.. అప్పడర్ధమైందా జ్యువెలరీ షాప్ ఓనర్ కి. కేసు స్టేషన్ కి చేరింది. ఎంక్వయిరీ మొదలైంది. ఇంతకీ చైన్ తో సహా ఏటీఎం లో డబ్బు తేవడానికి వెళ్లిన వాడు కనీసం పోలీసులకైనా చిక్కుతాడా? చిక్కడా? ఆ షాప్ ఓనర్లో టెన్షన్.. టెన్షన్. షూటు, బూటు ఉంటే పక్కా క్లాసు వ్యక్తులు అనుకోకండి. కంత్రీగాళ్లు, పక్కా నాటుగాళ్లు… వేషాలు మార్చి మోసాలకు పాల్పడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త..!

Also Read: కార్యకర్త చెంప చెల్లుమనిపించిన కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌.. వైరలవుతోన్న వీడియో

మోహన్ బాబుపై సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..