Car Theft: చిన్నపాటి నిర్లక్ష్యం.. 25 లక్షల కారు ఎత్తుకెళ్లిన దొంగ.. వివరాలు..

|

May 10, 2021 | 11:33 AM

Banjara Hills Police: మీ దగ్గర ఎలాంటి వాహనమున్నా.. ఇలాంటి పొరపాటు అస్సలు చేయకండి ఎందుకంటే.. అవి వెంటనే మాయమవుతాయి. చిన్న పాటి నిర్లక్ష్యం

Car Theft: చిన్నపాటి నిర్లక్ష్యం.. 25 లక్షల కారు ఎత్తుకెళ్లిన దొంగ.. వివరాలు..
Car Theft
Follow us on

Banjara Hills Police: మీ దగ్గర ఎలాంటి వాహనమున్నా.. ఇలాంటి పొరపాటు అస్సలు చేయకండి ఎందుకంటే.. అవి వెంటనే మాయమవుతాయి. చిన్న పాటి నిర్లక్ష్యం వల్ల వాహనాలు కనిపించకుండా పోతాయనడానికి ఉదాహరణ ఈ సంఘటనే. విశ్రాంత ఐఏఎస్‌ కుమారుడు ఒకతను రోడ్డుపై కారు నిలిపి తాళం చెవులను అందులోనే మరిచిపోయాడు. ఇంకేముంది గమనించిన ఓ వ్యక్తి ఆ కారుతో పరారయ్యాడు. ఈ సంఘటన ఎక్కడోకాదు.. మన భాగ్యనగరంలోనే జరిగింది. ఈ సంఘటనపై హైదరాబాద్ బంజారాహిల్స్‌ పోలీసుల కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బంజారాహిల్స్ రోడ్‌ నంబరు 10 పంచవటి కాలనీ ఐఏఎస్‌ సొసైటీలో విశ్రాంత ఐఏఎస్‌ వెంకటశివయ్య కుమారుడు కనమలూరు శ్రీహర్ష నివసిస్తున్నారు. ఆయన శనివారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో సమీపంలోని రత్నదీప్‌ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లి సామగ్రి కొని కారులో ఉంచారు. తాళం చెవి కారులోనే పెట్టి పక్కనే ఉన్న మెడ్‌ప్లస్‌లో మందులు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి ఈ విషయాన్ని పసిగట్టాడు. వెంటనే కారుతో అక్కడి నుంచి పరారయ్యాడు.

మందులు తీసుకొని బయటకు వచ్చిన శ్రీహర్షకు వాహనం కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సమీప సీసీ కెమెరాలను పరిశీలించగా అక్కడ జరిగిన సంఘటన అంతా బయటపడింది. ఈ కారు విలువ రూ.25 లక్షలు ఉంటుందని యజమాని పేర్కొన్నారు. దీనిపై శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ కెమెరాల సాయంతో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read:

Sadiq Khan: లండ‌న్ మేయ‌ర్‌గా పాక్ సంతతికి చెందిన సాదిక్ ఖాన్ ఎన్నిక.. వరుసగా రెండోసారి..

వ్యాక్సిన్ పాలసీలో జుడిషియల్ జోక్యం తగదు.,, సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ, ప్రభుత్వ నిర్ణయాలే ముఖ్యమని వివరణ