Illegal affair case: కలకాలం తోడుండాల్సిన వారే.. తప్పటడుగులు వేస్తున్నారు. దీంతో వైవాహిక బంధాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. తాజాగా.. ఓ మహిళ పొరుగింటి వ్యక్తితో కలిసి పారిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ నగర్ జిల్లా నివాసి అయిన కవిందర్ గురుగ్రామ్‌లోని కసన్ గ్రామంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్ కంపెనీలో పని చేయడంతోపాటు క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 10న అతడి భార్య రీనా పొరుగింటి వ్యక్తి రామ్‌వీర్‌తో కలిసి వెళ్లిపోయింది. దీనిపై కవిందర్ మనేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య చేసిన పనికి కవిందర్ తీవ్ర మనస్థాపం చెందాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న కవిందర్‌ను గమనించిన సోదరుడు సంతోష్ కుమార్.. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే కవిందర్ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కవిందర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. సోదరుడు సంతోష్ కుమార్ ఫిర్యాదుతో మృతుడి భార్య రీనా, ఆమె ప్రేమికుడు రాంవీర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని.. వారిద్దరిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..