Brutal Murder : ఉయ్యూరు ఆస్పత్రిలో దారుణ ఘటన.. పేషెంట్‌పై కత్తితో దాడి.. కారణాలు ఇలా ఉన్నాయి..

Brutal Murder : కృష్ణాజిల్లా ఉయ్యూరు ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పేషెంట్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

Brutal Murder : ఉయ్యూరు ఆస్పత్రిలో దారుణ ఘటన.. పేషెంట్‌పై కత్తితో దాడి.. కారణాలు ఇలా ఉన్నాయి..
Murder
Follow us
uppula Raju

|

Updated on: Feb 17, 2021 | 10:00 AM

Brutal Murder : కృష్ణాజిల్లా ఉయ్యూరు ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పేషెంట్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపల్లికి చెందిన మొగిలి ప్రభాకర్‌రావు కంటికి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు ఉయ్యూరులోని రోటరీ నేత్ర వైద్యశాల చేరారు. సోమవారం ఆయనకు శస్త్ర చికిత్స చేసి వార్డుకు తరలించారు. అయితే అతడు వార్డులో విశ్రాంతి తీసుకుంటుండగా అతని భార్య పార్వతి, తల్లి సామ్రాజ్యం మందులు తేవడానికి బయటకు వెళ్లారు.

ఇదే అనువైన సమయం అనుకొని ఓ వ్యక్తి ఆస్పత్రి వార్డులోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాకర్‌రావు శరీరంపై పలుచోట్ల కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం పారిపోయే ప్రయత్నం చేయగా వార్డులో ఉన్న రోగులు, వారి బంధువులు అప్రమత్తమై నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్‌రావును మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అయితే హత్యకు పాతకక్షలే కారణమని, నిందితుడు కూడా హతుడి స్వగ్రామానికి చెందిన రమేష్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ పంచాయతీ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్  దిగువన చూడండి..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే