Crime News: “ఎటు వెళ్తుంది ఈ సమాజం..?”.. సోషల్ మీడియాలో అక్కపై తమ్ముడి లైంగిక వేధింపులు
మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. బంధుత్వాలకు కూడా కనీస విలువ ఇవ్వడం లేదు. వావివరసలు మర్చి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు కొందరు నికృష్టులు.
Crime News: మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. బంధుత్వాలకు కూడా కనీస విలువ ఇవ్వడం లేదు. వావివరసలు మర్చి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు కొందరు నికృష్టులు. తాజాగా సొంత అక్కనే వేధింపులకు గురిచేసిన తమ్ముడు ఉదంతం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఓ యువతికి పదే, పదే అసభ్యకర మెస్సేజ్‌లు పెట్టాడు ఓ ఆగంతకుడు. వేధింపులతో విసిగిపోయిన యువతి సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కొన్నాళ్లగా సోషల్ మీడియాలో ఎవరో ఆగంతకుడు అసభ్య మెస్సేజ్‌లు పెడుతన్నట్లు ఫిర్యాదు చేసింది.
యువతిపై కంప్లైంట్‌పై విచారణ చేపట్టగా దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వరుసకు తమ్ముడయ్యే యువకుడే సదరు యువతికి అసభ్య మెస్సేజ్‌లు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. లైంగిక వాంఛలు తీర్చాలంటూ అక్కకే తమ్ముడు మెస్సేజ్‌లు చేసినట్లు నిర్ధారించారు. అక్క పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read:
Chicken Price Down: ఢమాల్.. ఢమాల్.. మరింత పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ రేటు ఎంతో తెలుసా..?
Viral Photo: పిచ్చికి పరాకాష్టా..?.. లేక ఫోటోషాపా.. వైరల్ ఫోటోపై నెటిజన్ల రియాక్షన్
Chris Gayle: సప్త సముద్రాలు ఈదినవాడికి పిల్లకాలవే ఎదురొస్తే..? క్రిస్ గేల్ విధ్వంసకర ఇన్నింగ్స్…