AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Lost: ఆన్‌లైన్ గేమ్‌కు బానిసైన బాలుడు 19 లక్షలు సమర్పించుకున్నాడు.. ఆరా తీస్తే వెలుగులోకి షాకింగ్ విషయాలు..

Money Lost: ఓ బాలుడు చేసిన పని వల్ల అతని తల్లిదండ్రులు రూ. 19 లక్షల నష్టపోయారు. 7వ తరగతి చదువుతున్న బాలుడు ఆన్‌లైన్ గేమ్స్‌కి అలవాటు పడ్డాడు. అలా గేమ్ ఆడటం కోసం

Money Lost: ఆన్‌లైన్ గేమ్‌కు బానిసైన బాలుడు 19 లక్షలు సమర్పించుకున్నాడు.. ఆరా తీస్తే వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Online Game
Shiva Prajapati
|

Updated on: Sep 21, 2021 | 12:30 PM

Share

Money Lost: ఓ బాలుడు చేసిన పని వల్ల అతని తల్లిదండ్రులు రూ. 19 లక్షల నష్టపోయారు. 7వ తరగతి చదువుతున్న బాలుడు ఆన్‌లైన్ గేమ్స్‌కి అలవాటు పడ్డాడు. అలా గేమ్ ఆడటం కోసం వర్చువల్ గన్స్, కార్స్ కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఆ బాలుడు తన తల్లిదండ్రుల అకౌంట్లను వినియోగించి భారీ మొత్తంలో డబ్బును ఖర్చు చేశాడు. అయితే దీని వెనుక 20 ఏళ్ల కుర్రాడి మాస్టర్ మైండ్ ఉంది. అస్సాంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్కూల్ విద్యార్థులందరికీ ఆన్‌లైన్ క్లాస్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అస్సాంకు చెందిన ఓ దంపతులు 7వ తరగతి చదువుతున్న తమ కుమారుడికి తమ సెల్‌ఫోన్‌ను ఇచ్చారు. అయితే, ఆ బాలుడు ఆ స్మార్ట్ ఫోన్‌ను ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం కాకుండా.. పబ్‌జి, బీజీఎంఐ వంటి ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం మొదలు పెట్టాడు. అలా ఆన్‌లైన్ గేమ్స్‌కి అలవాడు పడ్డాడు. అయితే ఈ గేమ్‌లో భాగంగా తన స్నేహితుడు నిపురాజ్ గొగోయ్(20) సహా మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక గ్రూప్‌లా ఏర్పాటు అయ్యాడు. వీరందరూ కలిసి గేమ్స్ ఆడటం ప్రారంభించారు. అయితే, గొగోయ్ కన్నింగ్ ప్లాన్ వేశాడు. బాలుడిని నమ్మించి.. అతని తల్లి ఫోన్ నుంచి విలువైన సమాచారాన్ని సేకరించాడు. యూపీఐ ఐడీల వివరాలను తీసుకున్నాడు. ప్రారంభంలో బాలుడితో నమ్మశక్యంగా ఉంటూ వచ్చిన గొగోయ్.. పబ్‌జి గేమ్‌లో వర్చువల్ గన్‌లు, కార్లు వంటివి కొనుగోలు చేయడానికి సహాయం చేశాడు. వీటి కొనుగోలుకు బాలుడి తల్లి యూపీఐ అకౌంట్లను వినియోగించాడు. ఆ తరువాత గొగోయ్ తన యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయడం ప్రారంభించాడు. బాలుడి వద్ద ఉన్న అతని తల్లి సెల్‌ఫోన్ సాయంతో.. ఐఫోన్‌ సహా మరో రెండు హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేశాడు.

అయితే, గొగోయ్ వద్ద రెండు ఖరీదైన స్మార్ట్ ఫోన్లు ఉండటాన్ని చూసి మైనర్ బాలుడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే తమ ఖాతా ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్‌కు వెళ్లి అకౌంట్ వివరాలను ఆరా తీశారు. అకౌంట్ నుంచి రూ. 19 లక్షలు మాయం అయినట్లు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఆన్‌లైన్ గేమ్ పేరుతో నమ్మించి మైనర్ బాలుడి సాయంతో అతని తల్లిదండ్రుల అకౌంట్ల నుంచి గొగోమ్ డబ్బులు కాజేసినట్లు గుర్తించారు. ‘‘గొగోయ్ ప్రతీ రోజూ యూపీఐ ద్వారా డబ్బులు ట్రాన్ఫర్ చేస్తుండేవాడు. లావాదేవీలకు సంబంధించిన ఓటీపీ(వన్‌టైమ్ పాస్‌వర్డ్) తీసుకుని, ఆ తరువాత డిలీట్ చేసేవాడు. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన మేసేజ్‌లు, ఇతర వివరాలు బాలుడి తల్లిదండ్రులకు ఏమాత్రం తెలియకుండా జాగ్రత్తపడ్డాడు.’’ అని పోలీసులు తెలిపారు. గొగోయ్.. ఈ బాలుడికే కాదు మరో ఇద్దరు మైనర్ బాలుళ్లకు కూడా గేమింగ్ విషయంలో సహాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, వ్యవహారంలో గొగోయ్ సహా మరో ముగ్గురు బాలురను పోలీసులు అరెస్ట్ చేశారు. గొగోయ్‌ని స్థానిక కోర్టులో హాజరుపరుచగా.. అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. అయితే వీరంతా మైనర్లు కావడంతో జువైనల్ కస్టడీకి పంపించారు. కాగా, గొగోయ్‌ను తమ కస్టడీలోకి కోరుతామని పోలీసులు తెలిపారు. డబ్బు మొత్తం ఎక్కడికి బదిలీ చేశాడో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ వ్యవహారంలో అతనితో పాటు ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే దానిపైనా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

ఇదిలాఉంటే.. తల్లిదండ్రులు తమ పిల్లల ఫోన్ల వినియోగంపై దృష్టి పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. పిల్లలు నిజంగానే ఆన్‌లైన్ క్లాసుల కోసమే ఫోన్లను వినియోగిస్తు్న్నారా? మరేదైనా ఉందా? అనే దానిపై ఫోకస్ పెట్టాలన్నారు. పిల్లలపై నిత్యం ఫోకస్ పెట్టడం ద్వారా వారు చెడు మార్గం పట్టకుండా నియంత్రించవచ్చునని అన్నారు.

Also read:

KIA Factory: అనంతపురం కియా ఫ్యాక్టరీలో టెన్షన్.. ఇనుప రాడ్లతో కొట్టుకున్న ఉద్యోగులు..

Viral Video: ఫ్రెండ్‌షిప్‌ అంటే ఈ గుర్రం, మేకలదే గురూ.. మనుషులు సైతం కుళ్లుకునేలా.. వీడియో వైరల్‌

Tirumala News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. స్వామివారి ఉచిత దర్శనం షురూ.. దర్శన సమయం పెంపు