Viral Video: ఫ్రెండ్‌షిప్ అంటే ఈ గుర్రం, మేకలదే గురూ.. మనుషులు సైతం కుళ్లుకునేలా.. వీడియో వైరల్
Goats and Horse friendship video: శత్రుత్వం చేయడం చాలా సులభం.. కానీ స్నేహం చేయడానికి విశాల హృదయం ఉండాలి.. మనుషులు ఒకరితో ఒకరు స్నేహం చేయడానికి
Goats and Horse friendship video: శత్రుత్వం చేయడం చాలా సులభం.. కానీ స్నేహం చేయడానికి విశాల హృదయం ఉండాలి.. మనుషులు ఒకరితో ఒకరు స్నేహం చేయడానికి ఎంతో ఆలోచిస్తారు.. స్నేహం చేస్తే మంచిగా ఉంటారా..? లేదా అనే ఎన్నో సందేహాలు మొదలవుతాయి. అయితే.. స్నేహానికి ఎలాంటి అడ్డుగీత ఉండదని.. ఈ జంతువులు ఉదాహరణగా నిలిచాయి. అయితే.. సోషల్ మీడియా ప్రపంచలో పలు జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోలు కొన్ని మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇందులో గుర్రం, మేకలు సరదాగా ఎంజాయ్ చేస్తున్నాయి. దీంతోపాటు గుర్రంపైకి ఎక్కి మేకలు సరదాగా ఆడుకుంటున్నాయి. వీటిస్నేహం చూసి చాలామంది వాహ్ అంటూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
గుర్రంపై స్వారీ చేయడం అంత సులభం కాదు.. దీని కోసం కఠిన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఫన్నీ వీడియోలో గుర్రంతో కలిసి మేకలు సరదాగా ఆడుకుంటున్నాయి. స్వారీ చేసేలా గుర్రంపైకి ఎక్కుతున్నాయి. ఈ వీడియోలో.. ఒక గుర్రం హాయిగా మేత మేస్తున్నట్లు చూడవచ్చు. అయితే దాని చుట్టూ చాలా మేకలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రెండు మేకలు వచ్చి గుర్రం వీపుపైకి ఎక్కి నిలబడతాయి. స్వారీకి సన్నద్ధమైనట్లుగా.. ఫొజులిచ్చి మళ్లీ కిందకు దిగుతాయి. ఈ వీడియోలో గుర్రం, మేకల స్నేహం చాలా మనోహరంగా కనిపిస్తుంది.
Viral Video:
Goats being goat..
Via @Yoda4ever pic.twitter.com/OZ7SwbgP4q
— Buitengebieden (@buitengebieden_) September 17, 2021
అయితే.. ఈ వీడియో చూసి చాలామంది నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ దృశ్యం నిజంగా అద్భుతంగా ఉందని.. ప్రేమ, స్నేహానికి ప్రతిరూపకమని పేర్కొంటున్నారు. చాలా రోజుల తర్వాత స్వచ్ఛమైన స్నేహాన్ని చూసిన అనుభూతి వస్తున్నట్లు పేర్కొంటున్నారు.
Also Read: