Shocking Video: జుట్టుకు నిప్పంటుకున్నా వళ్లు మరిచి వంటపనిలో నిమగ్నమైన మహిళ.. అంతలో ఏం జరిగిందంటే?
Viral Video: కొంత మంది ఏదైనా పని చేస్తున్నప్పుడు పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైపోతుంటారు. చుట్టూ పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోరు. అంతలా పనిలో మునిగిపోతారు.
Viral Video: కొంత మంది ఏదైనా పని చేస్తున్నప్పుడు పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైపోతుంటారు. చుట్టూ పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోరు. అంతలా పనిలో మునిగిపోతారు. అయితే, ఒక్కడ ఓ మహిళ తన ప్రాణాలే ప్రమాదంలో పడ్డా.. ఏమాత్రం గమనించలేదు. తలపై అగ్ని కీలలు ఎగసిపడుతున్నా.. కనీసం సోయి లేకుండా పనులు చేసుకుంటూపోయింది. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఓ మహిళ వంటగదిలో వంట చేస్తోంది. వంట చేయడంలో పూర్తిగా నిమగ్నమైపోయిన సదరు మహిళ.. హడువుడిగా ఏవేవో పనులు చేస్తోంది. అయితే, ఇంతలో వంట గదిలో కొన్ని వస్తువులను తీసుకోవడానికి గ్యాస్ స్టౌవ్ కింద ఉన్న కబోర్డ్‌లోకి వంగి చూసింది. అందులోని వస్తువులను తీసుకుంటుండగా.. పొరపాటున ఆమె జుట్టుకు మంటలు అంటుకున్నాడు. కానీ, జుట్టుకు మంటలు అంటుకున్న విషయాన్ని ఆ మహిళ గ్రహించలేదు. తలపై మంటలు చెలరేగుతున్నప్పటికీ.. ఆమె ఏమాత్రం గమనించకుండా.. పనులు చేసుకుంటూ ఉంది. అలా తలపై మంటలు ఎక్కువ అవడంతో.. ఏదో తేడాగా అనిపించి వెంటనే తలపై చూసుకుంది. జుట్టు అంతా కాలిపోవడాన్ని గమనించి వెంటనే తలపై నీళ్లు పోసింది. మంటలను ఆర్పేసింది. ఈ ఘటన అంతా కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆవీడియోను ట్విట్టర్ యూజర్ @Jamie24272184 సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
ఇదిలాఉంటే.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. తలపై అంతపెద్దగా మంటలు వ్యాపించినా.. స్పర్శ తెలియకపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. మరీ ఇంతలా నిమగ్నమైపోతారా? అంటూ విస్తుపోతున్నారు. ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియాలో సోమవారం నాడు పోస్ట్ చేయగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే 2 లక్షల మందికిపైగా నెటిజన్లు వీక్షించారు. వందలాది రీట్వీట్లు, వేల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వచ్చాయి. ఈ షాకింగ్ వీడియోను మీరు కూడా చూసేయండి.
Viral Video:
Do you smell something burning? pic.twitter.com/TycRvVpMlK
— Jamie Gnuman197… (@Jamie24272184) September 20, 2021
Also read:
India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో తగ్గుతున్న కరోనా ఉధృతి.. గత 24గంటల్లో ఎన్ని కేసులంటే..?