Crime News: హైదరాబాద్‌లో దారుణ హత్య.. హతమార్చి నడిరోడ్డుపై నగ్నంగా..
Crime News: హైదరాబాద్ పాతబస్తీ చంద్రయాణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నిర్మానుష్యమైన ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు...
హైదరాబాద్ పాతబస్తీ చంద్రయాణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నిర్మానుష్యమైన ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అటుగా వెళ్తున్న కొంతమంది వ్యక్తులు ఆ శవాన్ని చూసి చంద్రయాణగుట్ట పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
సంఘటనా స్థలంలో నగ్నంగా పడి ఉన్న గుర్తు తెలియని శవాన్ని గుర్తించారు. మృతుడి శరీరంపై చాలా చోట్ల కత్తి పోట్లు ఉండటంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడవేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి జాగిలాలను రప్పించి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు అన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..
గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!
గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!