AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Loans Scam: రుణాల పేరుతో ఘరానా మోసం.. రాష్ట్ర సరిహద్దు గ్రామాలే టార్గెట్.. వెలుగులోకి వచ్చి మరో చీటింగ్

కూలీ నాలీ పని చేసి.. ఫైసా ఫైసా కూడబెట్టిన సొమ్మును పొదుపు చేయాలనుకున్నారు. బ్యాంకులు లెక్కల గురించే అవగాహనే లేదు. ఇంకేముందు ఆసరా చేసుకున్న కేటుగాళ్లు రంగంలోకి దిగారు.

Women Loans Scam: రుణాల పేరుతో ఘరానా మోసం.. రాష్ట్ర సరిహద్దు గ్రామాలే టార్గెట్.. వెలుగులోకి వచ్చి మరో చీటింగ్
Self Help Groups Loans Scam
Balaraju Goud
|

Updated on: Sep 21, 2021 | 10:55 AM

Share

Self Help Groups Loans Scam: కూలీ నాలీ పని చేసి.. ఫైసా ఫైసా కూడబెట్టిన సొమ్మును పొదుపు చేయాలనుకున్నారు. బ్యాంకులు లెక్కల గురించే అవగాహనే లేదు. ఇంకేముందు ఆసరా చేసుకున్న కేటుగాళ్లు రంగంలోకి దిగారు. బ్యాంక్ ఖాతాలు తెరిచి లోన్లు ఇస్తామని చెప్పి.. పొదుపు పేరుతో డబ్బులు నొక్కేశారు. విషయం వెలుగులోకి రావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. చిత్తూరు జిల్లాలో అలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

మహిళల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకున్న కేటుగాళ్లు.. స్వయం సహాయక సంఘాలకు సహాయం పేరుతో మోసాలకు పాల్పడ్డారు. చిత్తూరు జిల్లాలోని తమిళనాడు సరిహద్దు గ్రామాలే టార్గెట్ గా మోసాలకు పాల్పడింది ఓ ముఠా. సెంథిల్, కుమార్, రాజ్ కుమార్, సంగీతలు అనే వ్యక్తులు ముఠాగా ఏర్పడి చిత్తూరు జిల్లా కేంద్రంలో మీనా ఫైనాన్స్ కంపెనీ పేరుతో సంస్థను స్థాపించారు. ప్రధాన కార్యాలయం పట్టణంలోనే ఉన్నట్లు తప్పుడు చిరునామాతో బురిడీ కొట్టించారు.

జిల్లాలోని శ్రీకాళహస్తీ, సత్యవేడు, బి.ఎన్ కండ్రిగ, ప్రాంతాలకు చెందిన పేదలకు ఆర్థిక సహాయం పేరుతో వడ్డీ లేకుండా ఒక్కో గ్రూపుకు 50 వేల రూపాయల చొప్పున రుణాలు మంజూరు చేస్తామని నమ్మబలికారు. ఇలా శ్రీకాశహస్తీ, సత్యవేడు మండలంలోని పలు గ్రామాల్లో కరపత్రాలు పంచి, మహిళలు నమ్మించి ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక గ్రూప్ నుండి 10 నుంచి 15 వేల రూపాయలు వసూలు చేశారు. బాధితుల నుంచి ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ రూపేణా పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారు. సంగీత, రాజ్ కుమార్ పేర్ల తో ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయించున్నారు.

ఇదిలావుంటే, కొందరు మహిళలు తమ అవసరాల కోసం రుణాలు పొందేందుకు సంస్థ నిర్వాహకులను సంప్రదించారు. ఇవాళ, రేపు అంటూ దాటవస్తూ రావడంతో.. అనుమానం వచ్చి ఫోన్ చేయడంతో సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు నిర్వహకులు. దీంతో తాము మోసపోయామని భావించిన బాధితులు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ మెట్టెక్కారు. కష్టపడి పోగేసిన సొమ్మును కాజేసిన కేటుగాళ్లును అరెస్ట్ చేసి, తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న సంస్థ నిర్వహకుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపుచర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Read Also…  Nandamuri Balarkishna: మరోసారి మంచి మనసు చాటుకున్న బాలకృష్ణ.. చిన్నారి క్యాన్సర్ పేషేంట్‌కు చికిత్స కోసం ఆర్ధిక సాయం

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!