AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉన్నావ్ జిల్లాలో వెలుగుచూసిన మరో దారుణం.. పశుగ్రాసం కోసం వెళ్లిన ఇద్దరు బాలికల అనుమానాస్పద మృతి

పశుగ్రాసం కోసం బాబుహరా గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన 15 ఏళ్లు, 14 ఏళ్లు, 16 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలికల్లో ఇద్దరు అనుమానాస్పదస్థితిలో మరణించిన సంఘటన సంచలనం రేకెత్తించింది.

ఉన్నావ్ జిల్లాలో వెలుగుచూసిన మరో దారుణం.. పశుగ్రాసం కోసం వెళ్లిన ఇద్దరు బాలికల అనుమానాస్పద మృతి
Balaraju Goud
|

Updated on: Feb 19, 2021 | 7:59 PM

Share

Two Dalit girls killed in UP : ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగుచూసింది. పశుగ్రాసం కోసం బాబుహరా గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన ఇద్దరు అనుమానాస్పదస్థితిలో మరణించిన సంఘటన సంచలనం రేకెత్తించింది. ఈ ఘటన యువతిపై అఘాయిత్యానికి పాల్పడి దహనం చేసిన ఉన్నావ్ జిల్లాలోనే ఈ దారుణం జరగడం మరింత భయాందోళనలకు గురిచేస్తోంది.

ఉన్నావ్ జిల్లాకు చెందిన ముగ్గురు బాలికలు 15 ఏళ్లు, 14 ఏళ్లు, 16 ఏళ్ల వయసున్న మిత్రులు పశుగ్రాసం కోసం అటవీ ప్రాంతానికి వెళ్లారు. బుధవారం అడవికి వెళ్లిన బాలికలు చీకటి పడినా ఇళ్లకు రాకపోయేసరికి కుటుంబసభ్యులు కంగారుకు గురయ్యారు. దీంతో గ్రామస్తుల సహయంతో అటవీ ప్రాంతంలో వెతులకుతుండగా, దట్టమైన పొదల్లో ముగ్గురూ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే ఇద్దరు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మరో బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో కాన్పుర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు బాలికలపై విష ప్రయోగం జరిగిందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి… Tamil Nadu Government: తమిళనాడు ముఖ్యమంత్రి కీలక నిర్ణయం.. వారిపై ఉన్న కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటన