Andhra Pradesh: గ్రూప్ – 2 పరీక్ష లేని సెంటర్ పేరుతో హాల్ టికెట్.. నివ్వెరపోయిన అధికారులు

| Edited By: Balaraju Goud

Feb 28, 2024 | 11:13 AM

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ టు ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ లో ఫేక్ హాల్ టికెట్ వెలుగు చూసింది. చిత్తూరు జిల్లాలో నకిలీ హాల్ టికెట్ భాగోతం బయట పడింది. కక్ష్య కట్టి నకిలీ హాల్ టికెట్ సృష్టించిన వ్యక్తిని అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు బండారాన్ని బయటపెట్టారు.రెండు కుటుంబాల మధ్య ఉన్న మనస్పర్ధలతో కుట్ర జరిగినట్టు స్పష్టం చేశారు.

Andhra Pradesh: గ్రూప్ - 2 పరీక్ష లేని సెంటర్ పేరుతో హాల్ టికెట్.. నివ్వెరపోయిన అధికారులు
Fake Hall Ticket
Follow us on

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ టు ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ లో ఫేక్ హాల్ టికెట్ వెలుగు చూసింది. చిత్తూరు జిల్లాలో నకిలీ హాల్ టికెట్ భాగోతం బయట పడింది. కక్ష్య కట్టి నకిలీ హాల్ టికెట్ సృష్టించిన వ్యక్తిని అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు బండారాన్ని బయటపెట్టారు.రెండు కుటుంబాల మధ్య ఉన్న మనస్పర్ధలతో కుట్ర జరిగినట్టు స్పష్టం చేశారు.

కర్నూలు జిల్లాలో మొదలై చిత్తూరు జిల్లాలో బయటపడ్డ ఈ వ్యవహరంలో ఇమ్మానియేల్ అనే వ్యక్తిని అరెస్టు చేయడంతో పాటు కంప్యూటర్ మొబైల్‌ను సీజ్ చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష కోసం ధరఖాస్తు చేసిన వరుసకు తమ్ముడిని మోసం చేయబోయి కటకటాల పాలైయ్యాడు అన్న. కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం కంబాలపాడుకు చెందిన సుదర్శనం డోన్ లో మీసేవ కేంద్రంలో పనిచేస్తున్న బంధువైన ఇమ్మానుయేల్ ను సంప్రదించడంతో కుట్రకు స్కెచ్ జరిగింది.

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ఇమ్మానుయేల్ సహాయం కోరాడు సుదర్శనం. రెండు కుటుంబాల మధ్య మనస్పర్థల కారణంగా సుదర్శనంను ఇరికించే ప్రయత్నం చేశాడు ఇమ్మన్యూయల్. ఇందు కోసం పక్కా పథకం రచించాడు. సుదర్శనం గ్రూప్ 2 పరీక్ష రాయకుండా ప్రయత్నం చేశాడు. అయితే నకిలీ హాల్ టికెట్‌తో పోలీసులకు పట్టుబడేలా ప్లాన్ చేశాడు. నకిలీ హాల్ టికెట్ ను సృష్టించి కర్నూలుకు దూరంగా ఉండే చిత్తూరు సెంటర్ లో పరీక్షకు హాజరయ్యేలా ఖతర్నాక్ ప్లాన్ చేశాడు ఇమ్మన్యుయెల్.

సుదర్శనం పై ఉన్న ఈర్షతోనే గ్రూప్ 2 పరీక్షకు హాజరు కాకుండా దరఖాస్తు చేసినట్లు నటించాడు ఇమ్మానుయేల్. ఇక గ్రూప్ 2 పరీక్షలు దగ్గర పడటం, హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ ప్రకటించడంతో ఇమ్మానుయేల్‌ను హాల్ టికెట్ అడిగాడు సుదర్శనం.
చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు వేరొకరి హాల్ టికెట్‌ను మార్ఫింగ్ చేసి సుదర్శనంకు అందించాడు ఇమ్మానుయేల్. దీంతో సుదర్శనం ఫ్యామిలీపై తనకున్న కక్ష్య తీరుతుందని భావించాడు.

చిత్తూరు నారాయణ కాలేజీలో పరీక్షా కేంద్రం ఉన్నట్లు హాల్ టికెట్ లో చూపించిన ఇమ్మానుయేల్ ఇక పని అయిపోయిందనుకున్నాడు. అయితే సీన్ రివర్స్ అయ్యింది. కర్నూలు నుంచి చిత్తూరుకు వచ్చిన సుదర్శనం పరీక్షా కేంద్రం కోసం వెతికి అసలు నిజం గుర్తించాడు. హాల్ టికెట్‌లోని పరీక్షా కేంద్రంలో గ్రూప్ 2 పరీక్షలు జరగడంలేదని గుర్తించి అధికారులను ఆశ్రయించాడు. హల్ టికెట్ నకిలీదిగా గుర్తించిన అధికారులు ఈ మేరకు చిత్తూరు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. నకిలీ హాల్ టికెట్ సృష్టించిన ఇమ్మానుయేల్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…