Job Fraud: నిరుద్యోగుల ఆశను పెట్టబడిగా చేసుకొని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు, మీడియా ఎన్ని రకాలుగా అవగాహన కలిపిస్తున్నా నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు. ఉద్యోగం పేరిట డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ప్రకాశం జిల్లా దర్శిలో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా దర్శిలోని పొదిలి రోడ్‌లో శ్రీసాయి జాబ్ ప్లేస్‌మెంట్ సెక్యూరిటీ సర్వీసెస్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపించారు. ఇలా నిరుద్యోగులు ఒక్కొక్కరి నుంచి రూ. 11 వేల చొప్పున వసూలు చేశారు. దర్శి, బంగోలు, గుంటూరుకు చెందిన నిరుద్యోగులకు ఈ సంస్థకు డబ్బులు చెల్లించారు. ఇదిగో ఉద్యోగం, అదిగో ఉద్యోగం అంటూ నమ్మబలికిన సదరు సంస్థ డబ్బులు చేతుల్లోకి రాగానే రాత్రి రాత్రికి జంప్ అయ్యారు.
రాత్రికి రాత్రి సంస్థ బోర్డ్ తిప్పేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. తాము మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. శ్రీసాయి జాబ్ ప్లేస్‌మెంట్ సెక్యూరిటీ సర్వీసెస్ నిర్వాహకులను పట్టుకునే పనిలో ఉన్నారు.
Also Read: Coronavirus: కొవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్.. బెడ్ పై నుంచి లేవలేకపోతున్నానంటూ..
Womens Fighting video: సచివాలయంలో మహిళల ఫైట్.. జుట్టు జుట్టు పట్టుకొని.. వైరల్ అవుతున్న వీడియో
Crime News: భార్యపై ప్రేమతోనే చైన్‌స్నాచింగ్ వైపు.. ఏకంగా సెంచరీ కొట్టాడు.. కీలక విషయాలు