Hyderabad: లేక లేక పుట్టిన చిన్నారిని కబలించిన డెంగీ.. కంటతడి పెట్టిస్తోన్న విషాధ సంఘటన.

|

Oct 03, 2021 | 9:20 AM

Hyderabad: ఆ జంటకు వివాహమైన ఏళ్లు గడిచినా సంతనం కలగలేదు. దీంతో ఎన్నో మొక్కులు మొక్కారు, ఎంతో మంది వైద్యుల చుట్టూ తిరిగారు. దీంతో వారి జీవితంలో..

Hyderabad: లేక లేక పుట్టిన చిన్నారిని కబలించిన డెంగీ.. కంటతడి పెట్టిస్తోన్న విషాధ సంఘటన.
Baby
Follow us on

Hyderabad: ఆ జంటకు వివాహమైన ఏళ్లు గడిచినా సంతనం కలగలేదు. దీంతో ఎన్నో మొక్కులు మొక్కారు, ఎంతో మంది వైద్యుల చుట్టూ తిరిగారు. దీంతో వారి జీవితంలో వెలుగులు నింపుతూ ఓ పండంటి ఆడబిడ్డ జన్మించింది. అయితే ఆ సంతో షం ఎంతో కాలం నిలవలేదు. వారి సంతోషాన్ని హరిస్తూ ఆ చిన్నారిని డెంగీ రోగం పొట్టన పెట్టుకుంది. ఈ విషాధ సంఘటన తాజాగా హైదరాబాద్‌లోని కూకట్‌ పల్లిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రజక నగర్‌కు చెందిన శ్రీనివాస్‌, మంజుల దంపతులకు పెళ్లైన 14 సంవత్సరాలకు పాప జన్మించింది. లేక లేక పుట్టిన చిన్నారి కావడంతో ఆ దంపతులు ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచారు. ప్రస్తుతం ఆ చిన్నారికి ఎనిమిది నెలలు. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌ 26న పాపకు జ్వరం రావడంతో.. వెంటనే శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో హైదరాబాద్‌ మియాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించడంతో డెంగీ పాజిటివ్‌గా తేలింది.

ఈ క్రమంలోనే చిన్నారి పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్థరాత్రి మరణించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు అందరినీ కలిచి వేశాయి. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందంటూ చిన్నారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.

Also Read: Bathukamma Song: తెలంగాణ గౌరమ్మ కోసం దిగివస్తున్న సంగీత దిగ్గజాలు. ఈసారి అంతర్జాతీయ స్థాయిలో బతుకమ్మ పాట..

Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా పెట్రోల్, ధరలు స్వల్ప మార్పు.. మన నగరంలో మాత్రం..

Weather Report: రానున్న రెండు రోజుల్లో ఏపీలో తేలికపాటి వర్షాలు.. తెలంగాణలో కూడా.