Accident: విషాదం.. హోటల్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఎనిమిది మంది దుర్మరణం..
Truck rams into road side hotel: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన ట్రక్కు రోడ్డు పక్కనే ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన
Truck rams into road side hotel: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన ట్రక్కు రోడ్డు పక్కనే ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన నలందా జిల్లాలోని తెలహాడ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. జెహానాబాద్ జిల్లా నుంచి అతివేగంగా వస్తున్న ట్రక్కు.. అకస్మాత్తుగా రోడ్డు పక్కనే ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోటల్ సిబ్బందితో సహా 8 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనతో ఉక్కసారిగా కోపోద్రిక్తులైన స్థానికులు.. ట్రక్కుకు నిప్పంటించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు వచ్చిన పోలీసులు, అధికారులు, వారి వాహనాలపై రాళ్లు విసిరారు.
మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీగా పోలీసు బలగాలు చేరుకోని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇదిలాఉంటే.. ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు వెంటనే సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
Also Read: