MP 6 people of a family died: ఈ కుటుంబమంతా అప్పటి వరకూ సంతోషంలో ఉంది. అందరూ కలిసి.. టిఫిన్లు చేసి సరదగా.. సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆనందంతో ఉన్న ఆ కుటుంబంలోని సభ్యులంతా ఒకేసారి విగతజీవులుగా మారారు. విద్యుదాఘాతంతో కేవలం నిమిషాల వ్యవధిలోనే ఒకే కుటుంబంలోని ఆరుగురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతార్‌పూర్ జిల్లాలోని బిజావర్ ఏరియాలో ఆదివారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజావర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు కుటుంబసభ్యులు సమాయత్తమయ్యారు. ఈ మేరకు విద్యుత్ మోటార్ సాయంతో ట్యాంక్‌లోని నీటిని ఖాళీ చేస్తున్నారు. ఈ క్రమంలో.. కుటుంబంలోని ఒకరికి విద్యుత్ వైర్ తగిలి.. షాక్‌నకు గురయ్యాడు. అతన్ని రక్షించే క్రమంలో కుటుంబంలోని మరో ఐదుగురు.. ప్రయత్నించారు. వారందరికీ విద్యుత్ షాక్ తగలడంతో.. నిమిషాల్లోనే ఆరుగురు మరణించారు.
గమనించిన స్థానికులు.. పోలీసులకు సమచారమిచ్చారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించినట్లు బీజావర్ డీఎస్పీ సీతారాం అవస్య తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు. అప్పటి వరకు ఇరుగుపొరుగుతో కలిసి మెలిసి ఉన్న కుటుంబంలోని ఆరుగురు సభ్యులు మరణించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read: