దారుణం.. ఒకే గదిలో 60 ఆవులు.. ఊపిరాడక 43 మృతి..

ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. బిలాస్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో 60 ఆవులను ఒకే గదిలో బంధించారు. దీంతో అందులో 43 ఆవులు ఊపిరాడక ప్రాణాలు విడిచాయి. ఈ దారుణ ఘటన జిల్లాలోని తాఖ‌త్‌పూర్..

దారుణం.. ఒకే గదిలో 60 ఆవులు.. ఊపిరాడక 43 మృతి..
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2020 | 7:51 PM

ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. బిలాస్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో 60 ఆవులను ఒకే గదిలో బంధించారు. దీంతో అందులో 43 ఆవులు ఊపిరాడక ప్రాణాలు విడిచాయి. ఈ దారుణ ఘటన జిల్లాలోని తాఖ‌త్‌పూర్ బ్లాక్ ప‌రిధిలోని మెడ్ప‌ర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని పంచాయితీ కార్యాలయానికి సంబంధించిన ఓ రూం నుంచి దుర్వాసన వస్తుండటం గమనించిన స్థానికులు.. వెంటనే ఆ గదిలో ఏం ఉందోనని తలుపులు పగలగొట్టి లోపల చూసి షాక్‌కు గురయ్యారు. ఆ గదిలో పెద్ద ఎత్తున ఆవులను బంధించి ఉంచడాన్ని గమనించారు. ఏకంగా 60 ఆవులను ఒకే గదిలో బంధించడంతో.. వాటికి ఊపిరి ఆడకపోయింది. దీంతో అందులో 43 ఆవులు ప్రాణాలు విడిచాయి. గ్రామస్థులు గమనించకపోతే.. మిగతా 17 ఆవులు పరిస్థితి ఏమయ్యేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయడంతో.. వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

కాగా, ఘ‌ట‌న‌పై బిలాస్‌పూర్ జిల్లా క‌లెక్ట‌ర్ మిట్ట‌ర్ విచారం వ్య‌క్తం చేశారు. ఆవులను గదిలో ఎవరు బంధించారు..? ఎప్పుడు బంధించారు..? ఎందుకు బంధించారు..? అన్న కోణంలో కేసు దర్యాప్తు కొనసాగుతుందని.. ఘటనపై అనిమల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని కలెక్టర్ తెలిపారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?