AP Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం..

Kadapa accident: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే

AP Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం..
Kadapa Accident

Updated on: Aug 07, 2021 | 7:41 AM

Kadapa accident: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘోర సంఘటన జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలంలోని అగ్రహారం వద్ద చోటుచేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి ఇన్నోవా కారును ఎదురుగా టమాటా లోడ్‌తో  వస్తున్న లారీ ఢీకొంది. దీంతో ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో మరణించిన నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయని వారికి ప్రస్తుతం చికిత్స అందుతుందని వెల్లడించారు. వారి పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

కాగా.. వీరంతా కర్ణాటక లోని మొగల్కోట్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. మృతులు సద్దాం, రేష్మ, సల్మా, భాష లుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

కండోమ్ తేనందుకు మైనర్‌పై దాడి.. ఆగ్రహంతో ఊగిపోయిన యువకుడు

కర్నాటకలో సెల్ ఫోన్స్ కంటైనర్ చోరీ.. 6 కోట్ల విలువైన మొబైల్ ఫోన్స్‌ని ఎత్తుకెళ్లిన దొంగలు..

Tirupati Kidnap: తిరుపతి కిడ్నాప్‌ కథ సుఖాంతం… తల్లి చెంతకు చేరిన 4 నెలల బాలుడు..