కల్తీ మద్యం కాటుకు నలుగురు మృతి
కల్తీ మద్యం సేవించి నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ ప్రాంత సమీపంలోని ముచ్చల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కల్తీ..

కల్తీ మద్యం సేవించి నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ ప్రాంత సమీపంలోని ముచ్చల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కల్తీ మద్యం సేవించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరికి బీపీ పెరగడంతో.. కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యంలోనే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారని బాధిత కుటుంబీకులు తెలిపారు. మరోవైపు గ్రామంలో కల్తీ మద్యం తాగి ఆరుగురు వ్యక్తులు చనిపోయారని గ్రామస్థులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం నలుగురు చనిపోయినట్లు వెల్లడించారు. ఈ కల్తీ మద్యం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.
Read More
కాలుజారి నదిలో పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే