వరకట్న వేధింపులు తాళలేక..వివాహిత ఆత్మహత్య

వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పెళ్లయిన రెండు వారాల నుంచే అదనపు కట్నం కోసం అత్తింటి వారు

వరకట్న వేధింపులు తాళలేక..వివాహిత ఆత్మహత్య
Follow us

|

Updated on: Jul 31, 2020 | 12:11 PM

వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పెళ్లయిన రెండు వారాల నుంచే అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తుండటంతో ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తమిళనాడు రాజధాని చెన్నైలోని చింతాద్రిపేటకు చెందిన ఓ యువతికి హైదరాబాద్‌కు చెందిన యువకుడితో మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా పరిచయం ఏర్పాడింది. రెండు కుటుంబాల అంగీకారంతో వీరి వివాహం జరిగింది. పెళ్లయిన రెండు వారాలకే అత్తింటి వారు వరకట్నం కోసం వేధించసాగారు. దీంతో ఆమె చెన్నైలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, కొద్ది నెలల క్రితం చెన్నైకి వెళ్లిన ఆమె భర్త లాక్‌డౌన్ కారణంగా చింతాద్రిపేటలోని అత్తగారింట్లోనే ఉండిపోయాడు.  ఈ క్రమంలోనే తన కూతురిని కాపురానికి తీసుకెళ్లి మంచిగా చూసుకోవాలని యువతి తండ్రి అల్లుడిని కోరాడు.

అయితే, కట్నంగా 120 సవర్ల బంగారం అడిగితే 40 సవర్లు మాత్రమే ఇచ్చారని, మిగిలిన బంగారం కూడా ఇస్తేనే మీ కూతురిని కాపురానికి తీసుకెళ్తానని అల్లుడు చెప్పాడు.దీంతో మనస్తాపానికి గురైన యువతి బుధవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.