మహేశ్వరంలో ఘోర రోడ్డుప్రమాదం..ఇద్దరు మృతి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహేశ్వరం మండలంలోని శ్రీనగర్ ఫ్యాబ్ సిటీ సమీపంలో అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహేశ్వరం మండలంలోని శ్రీనగర్ ఫ్యాబ్ సిటీ సమీపంలో అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా..మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు కందుకూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. వారు ఫ్యాబ్ సిటీలోని రేడియెంట్ కంపెనీలో పనిచేస్తున్నట్లుగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
Read More:
వరకట్న వేధింపులు తాళలేక..వివాహిత ఆత్మహత్య
Ranga Reddy DistrictRangareddyroad accidentroad accident in ranga reddy districttwo people died and one injured