జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఒకే రోజు ముగ్గురు మహిళలు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. మల్యాల మండలం తక్కలపెల్లి గ్రామానికి చెందిన లక్ష్మి రూప, అదే గ్రామానికి చెందిన సూర్య కళ… మానాల గ్రామంకు చెందిన సుమలత ఒకే రోజు కనిపించకుండా పోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు మహిళలు ఒకే రోజు అదృశ్యం అవ్వడం వెనుక గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వీరిని ఎవరైనా కిడ్నాప్ చేశారా..? లేదా వారే కావాలని ఎక్కడికైనా వెళ్లారా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. మిస్సైన ముగ్గురు మహిళల్లో.. ఒకరితో మరొకరి సంబంధం ఉందా అనే యాంగిల్‌లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు కూడా కేసులను సవాల్‌గా తీసుకుని విచారణ జరుపుతున్నారు. మిస్ అయినవారి ఆచూకి తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పోటోల్లో ఉన్న మహిళలు ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.
దేశవ్యాప్తంగా 2019లో 44,546 సైబర్ నేరాలు నమోదైతే వాటిలో 26,891 (60.4 శాతం) ఆర్థిక సంబంధ నేరాలే. తెలంగాణలోనూ మొత్తం 2,691 కేసుల్లో 2013 (70.4 శాతం) ఈ తరహావే. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్ నంబరు 155260ను అందుబాటులోకి తెచ్చింది. లేదంటే జాతీయ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.inకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. అవసరమైన వివరాలు చెప్పాక బాధితులకు సంక్షిప్త సందేశం లేదా మెయిల్ ద్వారా లాగిన్ ఐడీ/ అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబరు వస్తుంది. దాని ఆధారంగా www.cybercrime.gov.inకు 24 గంటల్లోపు ఫిర్యాదు చేయాలి.
Also Read: సౌండ్ ఎక్కువైతే సైలెన్సర్ పగులుద్ది.. ఆకతాయిల తిక్క కుదిర్చిన అనంత పోలీసులు