Hyderabad Road Accident: దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. తాజాగా.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో పాల లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఈఘటన నగరంలోని వనస్థలిపురం (Vanasthalipuram) సుష్మా థియేటర్ వద్ద జరిగింది. హయత్‌నగర్ నుంచి ఎల్బీనగర్ వైపు పాలు తీసుకెళ్తున్న లారీ.. బ్రేక్ ఫెయిల్ మొదట డివైడర్‌ను ఢీ కొట్టింది. అనంతరం అదుపుతప్పిన లారీ ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి.. రహదారి పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు. కాగా.. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..