యువ‌త‌కూ క‌రోనా ముప్పు ఎక్కువే! WHO చీఫ్ సంచ‌ల‌న కామెంట్స్..

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య తాండ‌వం సృష్టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా కోటి 70 ల‌క్ష‌ల‌కు పైగానే కేసులు చేరాయి. క‌రోనా సోకే విష‌యంలో యువ‌కులు కూడా అతీతులు కాద‌ని పున‌రుద్ఘాటించింది డ‌బ్ల్యూహెచ్‌వో. ఈ విష‌యాన్ని ఇది వ‌ర‌కే స్ప‌ష్టం చేశామ‌ని....

యువ‌త‌కూ క‌రోనా ముప్పు ఎక్కువే! WHO చీఫ్ సంచ‌ల‌న కామెంట్స్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 31, 2020 | 6:05 PM

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య తాండ‌వం సృష్టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా కోటి 70 ల‌క్ష‌ల‌కు పైగానే కేసులు చేరాయి. క‌రోనా సోకే విష‌యంలో యువ‌కులు కూడా అతీతులు కాద‌ని పున‌రుద్ఘాటించింది డ‌బ్ల్యూహెచ్‌వో. ఈ విష‌యాన్ని ఇది వ‌ర‌కే స్ప‌ష్టం చేశామ‌ని.. అయిన‌ప్ప‌టికీ మ‌రోమారు హెచ్చరిస్తున్న‌ట్లు కీల‌క‌మైన‌ కామెంట్స్ చేశారు డబ్ల్యూహెచ్‌వో డైరెక్ట‌ర్ టెడ్రోస్ అథ‌న‌మ్ గెబ్రియేసిస్. అలాగే యువ‌కుల‌ను కూడా క‌రోనా వైరస్ బ‌ల‌హీన ప‌రుస్తుంద‌ని, చంపేయ‌గ‌ల శ‌క్తి కూడా ఆ వైర‌స్‌కు ఉన్న‌ట్లు టెడ్రోస్ తెలిపారు.

ఈ కోవిడ్ కేవ‌లం వృద్ధుల‌కు మాత్ర‌మే వ‌స్తుందంటే పొర‌పాటే. వృద్ధుల ప్రాణాలే కాకుండా.. యువత కూడా ఆ వైర‌స్‌కు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు చెప్పారు. అనేక దేశాల డేటాను ప‌రిశీలిస్తే.. 50 ఏళ్ల లోపు వారు కూడా హాస్పిట‌ల్ పాలైన కేసులు చాలా ఉన్న‌ట్లు డబ్ల్యూహెచ్‌వో డైరెక్ట‌ర్ టెడ్రోస్ వెల్ల‌డించారు. జెనీవాలో వ‌ర్చువ‌ల్ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ టెడ్రోస్ ఈ విష‌యాల‌ను తెలిపారు. మాకు క‌రోనా రాద‌ని యూత్ అపోహ‌లో ఉంటున్నారు. అంతేకాకుండా విచ్చ‌ల‌విడిగా తిరుగుతున్నారు. ఈ వ్యాధి ప్ర‌మాద‌క‌ర స్థాయిని ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేం. వ‌చ్చే రోజుల్లో ఈ కోవిడ్ మ‌హ‌మ్మారి మరింత ప్ర‌మాద‌క‌రంగా తయార‌వుతుంది. అప్పుడు క‌రోనాను అదుపు చేయ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌ని డాక్ట‌ర్ మైక్ ర్యాన్ తెలిపారు.

Read More:

‘స‌చిన్ కూతురు సారా’, ‘క్రికెట‌ర్ శుభ్ మాన్ గిల్’ మ‌ధ్య ఏం జ‌రుగుతోంది?

ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ కుమార్‌కి షాక్‌.. ఫోన్ హ్యాక్ చేసి బెదిరింపులు..

త‌న తాత‌ను త‌లుచుకుని ఎమోష‌న‌ల్ అయిన బ‌న్నీ.. ట్వీట్ చేస్తూ..