ఢిల్లీలో అదుపులోకి వస్తున్న కరోనా
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తుంది. గత కొద్ది రోజులుగా వెయ్యి నుంచి పన్నెండు వందలకు మధ్య కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు రికవరీలు కూడా పెద్ద ఎత్తున..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తుంది. గత కొద్ది రోజులుగా వెయ్యి నుంచి పన్నెండు వందలకు మధ్య కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు రికవరీలు కూడా పెద్ద ఎత్తున ఉంటున్నాయి. మరోవైపు కేసుల సంఖ్య పెరిగితే అప్రమత్తంగా ఉండేందుకు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా రోజు వారీగా టెస్టుల సంఖ్యను కూడా పెంచేశారు. గడిచిన 24 గంటల్లో ఢిల్లీ వ్యాప్తంగా కొత్తగా మరో 1195 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,35,598కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 1,20,930 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా 10,705 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఢిల్లీ వ్యాప్తంగా కరోనా బారినపడి 27 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా కరోనా బారినపడి 3,963 మంది మరణించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.
#Correction 5,629 RT-PCR/CBNAAT/TrueNat tests and 13,462 rapid antigen tests conducted today in Delhi. Total tests done so far stands at 10,32,785: Government of Delhi https://t.co/jKNliIllfe
— ANI (@ANI) July 31, 2020
Read More
కాలుజారి నదిలో పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
తైవాన్ మాజీ అధ్యక్షుడు ఇక లేరు