ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని.. వైసీపీ ఎమ్మెల్యే పూజలు
ప్రముఖ సీనియర్ సింగర్ బాలసుబ్రమణ్యం కరోనా మహమ్మారితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. గత 15 రోజులుగా ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలు కూడా బాల సుబ్రమణ్యం...
ప్రముఖ సీనియర్ సింగర్ బాలసుబ్రమణ్యం కరోనా మహమ్మారితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. గత 15 రోజులుగా ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలు కూడా బాల సుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. మరికొందరు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా తిరుపతిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. బాల సుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని వెంకటేశ్వరుడ్ని వేడుకున్నాని.. ఆయన మళ్లీ పాటలు పాడాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఎస్పీ బాల సుబ్రమణ్యానికి టీటీడీతో మంచి అనుబంధం ఉందన్నారు చెప్పారు. కాగా ప్రస్తుత బాలు ఆరోగ్యం ఇంకా విషమంగా ఉందని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వెంటి లేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని, కాలేయం మినహా అన్ని అవయవాలు పని చేస్తున్నాయని డాక్టర్లు వెల్లడించారు. ఇక తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఎస్పీ చరణ్ కంటతడి పెట్టిన వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
Read More:
తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు!