మనకు కరోనా సోకినట్లయితే.. మొదటిగా కనిపించే లక్షణం ఇదే..!
ఇటీవల జరిగిన పరిశోధనల్లో వైరస్ లక్షణాలు ఓ నిర్దిష్ట క్రమంలో కనిపిస్తాయని తేలింది. దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ అధ్యాయాన్ని బయటపెట్టారు. ఫ్రాంటియర్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ నివేదిక మేరకు..
First Symptom Of Coronavirus: ప్రపంచవ్యాప్తంగా మానవళి మనుగడకే కరోనా సవాలుగా మారింది. కోవిడ్ మహమ్మారి ప్రాణాంతకతను కలిగించడమే కాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసింది. ఇటువంటి తరుణంలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలపై ప్రపంచ పరిశోధకులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైరస్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా ఫలితాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన పరిశోధనల్లో వైరస్ లక్షణాలు ఓ నిర్దిష్ట క్రమంలో కనిపిస్తాయని తేలింది. దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ అధ్యాయాన్ని బయటపెట్టారు. ఫ్రాంటియర్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ నివేదిక మేరకు..
దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం.. కరోనాకు ప్రధాన లక్షణాలైన వీటిని ముందుగానే గుర్తించవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వల్ల రోగులకు వేగంగా చికిత్స చేసే అవకాశం కూడా ఉంటుందన్నారు. కరోనా సోకితే.. ముందుగా జ్వరం వస్తుందని.. ఆ తర్వాత దగ్గు. కండరాల నొప్పి వస్తాయని అధ్యయనం పేర్కొంది. ఇక ఆ తర్వాత వికారం, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. ఫ్లూ లాంటి అంటువ్యాధులతో కోవిడ్ 19 లక్షణాలు సమానంగా ఉన్నప్పుడు వాటి నిర్దిష్ట క్రమాన్ని ఈజీగా తెలుసుకోవచ్చునని యూఎస్సీ ప్రొఫెసర్ పీటర్ కుహ్న్ తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ డేటా ప్రకారం.. పరిశోధకులు చైనాలో ధృవీకరించబడిన 55,000 కరోనా కేసులను విశ్లేషించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 1994 నుంచి 1998 వరకు దాదాపు 2500 ఇన్‌ఫ్లూఎంజా కేసులను కూడా పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చారు.
Also Read:
కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..