AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ‌ర‌ల్డ్ క‌రోనా అప్‌డేట్స్.. 2.40 కోట్ల‌కి చేరిన పాజిటివ్ కేసులు

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,58,358కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 8,23,510 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇక‌ ప్రస్తుతం 66,26,781 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,66,08,067 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి..

వ‌ర‌ల్డ్ క‌రోనా అప్‌డేట్స్.. 2.40 కోట్ల‌కి చేరిన పాజిటివ్ కేసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 15, 2020 | 8:28 PM

Share

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ప‌లువురు సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖులు, పోలీసులు, వైద్యులు ఈ వైర‌స్ బారిన ప‌డుతోన్న‌ విష‌యం తెలిసిందే. కాగా ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,58,358కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 8,23,510 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇక‌ ప్రస్తుతం 66,26,781 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,66,08,067 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్ర‌స్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 59,55,728కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 1,82,404 మంది మృతి చెందారు. కాగా 25,19,042 యాక్టీవ్ కేసులు ఉండగా, 32,54,282 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు పెరుగుతూ, త‌గ్గుతూ ఉన్నాయి.

భార‌త‌ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 67,151 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1059 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 32,34,474కి చేరుకుంది. ఇందులో 7,07,267 యాక్టివ్ కేసులు ఉండగా.. 59,449 మంది కరోనాతో మరణించారు. అటు దేశంలో ఇప్పటివరకు 24,67,758 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

Read More:

బ్రేకింగ్ః తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్

ఆ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులకు సీఎం జ‌గ‌న్‌ గుడ్ న్యూస్‌

బిగ్‌బాస్-4 కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్?

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!