AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నరరూప రాక్షసుడు.. గంజాయి మత్తులో 5 ఏళ్ల చిన్నారిని దారుణంగా..

పసిమొగ్గపై పైశాచికం పడగవిప్పింది. మద్యం, గంజాయి మత్తులో ఓ నరరూప రాక్షసుడు ఐదేళ్ల చిన్నారిని పొట్టనబెట్టుకున్నాడు. గాఢనిద్రలో ఉన్న చిన్నారిని ఎత్తుకెళ్లి, కేకలు వేయకుండా నోట్లో గుట్కా కుక్కి మరీ లైంగిక దాడికి ఒడిగట్టాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలు వదిలిన ఆ చిన్నారి విషాదం ప్రకాశం జిల్లాను కన్నీటి సంద్రంలో ముంచెత్తింది.

Andhra Pradesh: నరరూప రాక్షసుడు.. గంజాయి మత్తులో 5 ఏళ్ల చిన్నారిని దారుణంగా..
5 Year Old Girl Assaulted In Prakasam
Fairoz Baig
| Edited By: |

Updated on: Oct 26, 2026 | 6:55 PM

Share

ప్రకాశం జిల్లాలో అత్యంత హేయమైన, అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మద్యం, గంజాయి మత్తులో ఓ కామాంధుడు ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా చిన్నారి అరవకుండా నోట్లో గుట్కా కుక్కి పైశాచికంగా ప్రవర్తించాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆ చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. నాగులుప్పలపాడు మండలంలో జరిగిన ఈ ఘోరం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగులుప్పలపాడు మండలానికి చెందిన అజ్జం ఆనంద్ (25) తల్లిదండ్రులు చనిపోవడంతో జులాయిగా తిరుగుతూ మద్యం, గంజాయికి బానిసయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, ఒక బాబు ఉన్నప్పటికీ.. అతని చెడు ప్రవర్తన భరించలేక భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఆనంద్.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం, గంజాయి సేవించాడు. పీకలదాకా మత్తులో మునిగిపోయిన అతడు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పిన్ని పక్కన నిద్రపోతున్న ఐదేళ్ల చిన్నారిని గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లాడు.

నోట్లో గుట్కా పోసి.. పాడుబడ్డ ఇంట్లో కిరాతకం

చిన్నారిని సమీపంలోని పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లిన నిందితుడు, ఆమె కేకలు వేయకుండా బలవంతంగా నోట్లో గుట్కా కుక్కి నోరు మూసేశాడు. గుట్కా ఘాటుకు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ పసికందుపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. అనంతరం చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అక్కడే వదిలేసి పరారయ్యాడు. నిద్రలేచి చూసేసరికి పాప కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలించగా.. పాడుబడ్డ ఇంట్లో రక్తపు మడుగులో, అపస్మారక స్థితిలో చిన్నారి కనిపించింది. వెంటనే బాధితురాలిని ఒంగోలు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది.

నిందితుడిని స్తంభానికి కట్టేసిన గ్రామస్తులు

పాపపై జరిగిన ఘోరం వెలుగులోకి రావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్తులు నిందితుడు ఆనంద్‌ను పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అతడి చేత నిజం చెప్పించిన అనంతరం పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఒంగోలు రూరల్ సీఐ శేషగిరిరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

భగ్గుమన్న బంధువులు.. కలెక్టర్, ఎస్పీ పరిశీలన

కామాంధుడిని కఠినంగా శిక్షించాలంటూ చదలవాడ సమీపంలో రహదారిపై చిన్నారి బంధువులు రాస్తారోకోకు దిగారు. ఈ క్రమంలో ఓ మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంధువులు ఆమెను అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఒంగోలు జీజీహెచ్ మార్చురీలో ఉన్న చిన్నారి మృతదేహాన్ని జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన కలెక్టర్.. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితుడికి మరణశిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. గంజాయి, మత్తు పదార్థాల వల్లే ఇలాంటి విచక్షణారహిత అఘాయిత్యాలు జరుగుతున్నాయని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Follow Us
నరరూప రాక్షసుడు.. గంజాయి మత్తులో 5 ఏళ్ల చిన్నారిని దారుణంగా..
నరరూప రాక్షసుడు.. గంజాయి మత్తులో 5 ఏళ్ల చిన్నారిని దారుణంగా..
ఈ పప్పుతో ఫేస్ ప్యాక్ వేస్తే మీ ముఖం  రంగు మారడం  ఖాయం!
ఈ పప్పుతో ఫేస్ ప్యాక్ వేస్తే మీ ముఖం  రంగు మారడం  ఖాయం!
మోసాన్ని భరించ లేకపోయింది.. చివరికీ..!
మోసాన్ని భరించ లేకపోయింది.. చివరికీ..!
Video: వెనిజులాకు తిరిగొచ్చిన ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో
Video: వెనిజులాకు తిరిగొచ్చిన ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో
జపాన్‌లో 100 ఏళ్లు దాటిన వారు లక్షమందికి పైనే..వాళ్ల సీక్రెట్ ఇదే
జపాన్‌లో 100 ఏళ్లు దాటిన వారు లక్షమందికి పైనే..వాళ్ల సీక్రెట్ ఇదే
మీకు అబ్బాయి పుడితే ఏ రంగు దుప్పటి ఇస్తారు? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
మీకు అబ్బాయి పుడితే ఏ రంగు దుప్పటి ఇస్తారు? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
విజయ్-రష్మికలపై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు
విజయ్-రష్మికలపై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు
తీరానికి చేరువలో అర్నబ్ తుపాన్.. రెండు రోజులు చాలా జాగ్రత్త!
తీరానికి చేరువలో అర్నబ్ తుపాన్.. రెండు రోజులు చాలా జాగ్రత్త!
ప్రభాస్‏తో ఆ సినిమా.. పట్టుబట్టి చేయించాడు.. చివరకు..
ప్రభాస్‏తో ఆ సినిమా.. పట్టుబట్టి చేయించాడు.. చివరకు..
  గోధుమ పిండితో ఫేస్ ప్యాక్.. ముఖంపై బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయా?
  గోధుమ పిండితో ఫేస్ ప్యాక్.. ముఖంపై బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయా?