AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : ప్రభాస్‏కు ఆ సినిమా సెట్ కాదు అని ఎంత చెప్పినా వినలేదు.. చివరకు ప్లాప్ అయ్యింది.. కానీ టీవీలో సూపర్ హిట్..

దర్శకుడు కృష్ణవంశీ ప్రభాస్ తో చేసిన ఓ సినిమా పరాజయంపై ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ ఇమేజ్‌కు అది సరైన ప్రాజెక్ట్ కాదని, కథాబలం ఉన్న చిత్రాలు చేయాలనే ప్రభాస్ కోరిక వల్లే ఆ సినిమా రూపొందిందని తెలిపారు. తన సినిమాలకు అవార్డులు వచ్చినా, రాకపోయినా ఎలాంటి భావోద్వేగ అనుబంధం ఉండదని పేర్కొన్నారు.

Prabhas : ప్రభాస్‏కు ఆ సినిమా సెట్ కాదు అని ఎంత చెప్పినా వినలేదు.. చివరకు ప్లాప్ అయ్యింది.. కానీ టీవీలో సూపర్ హిట్..
Krishna Vamsi, Prabhas
Rajitha Chanti
|

Updated on: Oct 26, 2026 | 6:29 PM

Share

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ, ప్రభాస్ నటించిన చక్రం సినిమా పరాజయంపై, తన సినీ జీవితం, వ్యక్తిగత ఆలోచనలపై ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నారు. ఆయన మాటల్లో చక్రం సినిమా ఫ్లాప్‌కు గల కారణాలు వెల్లడించారు. చక్రం సినిమా ప్రభాస్‌కు “రాంగ్ ప్రాజెక్ట్” అని కృష్ణవంశీ కుండబద్దలు కొట్టారు. మొదట తాను ప్రభాస్‌కు యాక్షన్ చిత్రం కథను వినిపించినప్పుడు, అప్పటికే వరుస యాక్షన్ చిత్రాలు చేస్తున్న ప్రభాస్, కథాబలం ఉన్న, భిన్నమైన సినిమా చేయాలని కోరారని ఆయన తెలిపారు. షారుఖ్ ఖాన్ నటించిన కల్ హో నా హో (అదే తరహాలో అమితాబ్ బచ్చన్ నటించిన హృషికేశ్ ముఖర్జీ గారి ఆనంద్, గుల్జార్ తీసిన బావర్చి సినిమాలతో పోల్చారు) వంటి భావోద్వేగభరితమైన కథకు ప్రభాస్ ఆసక్తి చూపడంతో చక్రం కథను రూపొందించినట్లు కృష్ణవంశీ వివరించారు. అయితే, ప్రభాస్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో, మధ్యలో యాక్షన్ సన్నివేశాలు, ఫైట్ బ్లాక్‌లు చేర్చడం పెద్ద పొరపాటని ఆయన అన్నారు. ఈ నిర్ణయమే సినిమాకు ప్రతికూలంగా మారిందని, ప్రభాస్ విభిన్నమైన పాత్రలు చేయాలనే తపనతో చాలా కష్టపడ్డారని కృష్ణవంశీ గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

చక్రం చిత్రానికి ముగ్గురు కెమెరామెన్‌లు పనిచేయడానికి గల కారణాలను కూడా కృష్ణవంశీ వెల్లడించారు. అరవింద్ కృష్ణ (వీఎస్ఆర్ స్వామి అల్లుడు, పీసీ శ్రీరామ్ అసిస్టెంట్) తో సినిమా ప్రారంభమైందని, అయితే సెల్వరాఘవన్ సినిమాకు అవకాశం రావడంతో ఆయన మధ్యలో వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. అప్పుడు ఓం ప్రకాష్ సినిమాలోకి ప్రవేశించగా, ఆయనకు మరో సినిమా రావడంతో వారం రోజులకే వెళ్ళిపోయారని చెప్పారు. చివరకు రామ్ ప్రసాద్ మిగిలిన సినిమా భాగాన్ని పూర్తి చేశారని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam: వాళ్లు ఏదో అనుకుంటారని ఆగకు.. జీవితంపై బ్రహ్మానందం చెప్పిన అద్భుతమైన మాటలు..

కృష్ణవంశీ తన జీవితంలో ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటానని, బాధలు వచ్చినా వాటిని ఒక ప్రక్రియగా చూస్తానని అన్నారు. దేవుడు అనే భావనను ఒక “సూపర్ ఎనర్జీ”గా అన్నారు. సూర్యుడు, భూమి, వాతావరణం, నీటి చక్రం, చెట్లు-గాలి మధ్యనున్న సమతుల్యత వంటి అద్భుతమైన ప్రకృతి అరేంజ్‌మెంట్‌లను ప్రస్తావించారు. ఈ ఏర్పాట్లన్నీ మనుగడకు అవసరమైనవని, వాటి పట్ల కృతజ్ఞతగా ఉండటమే దైవారాధన అని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Kodi Ramakrishna: ఒక్క ఏడాదిలోనే 23 సినిమాలు చేసిన ఏకైక హీరో.. దాసరి గారు ఒక మాట అన్నారు.. డైరెక్టర్ కోడి రామకృష్ణ..

ఎక్కువ మంది చదివినవి : SV Krishna Reddy: ఆమె అద్భుతమైన హీరోయిన్.. మధ్యతరగతి పాత్రలకు సరిగ్గా సెట్ అవుతుంది.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

Follow Us
ప్రభాస్‏తో ఆ సినిమా.. పట్టుబట్టి చేయించాడు.. చివరకు..
ప్రభాస్‏తో ఆ సినిమా.. పట్టుబట్టి చేయించాడు.. చివరకు..
  గోధుమ పిండితో ఫేస్ ప్యాక్.. ముఖంపై బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయా?
  గోధుమ పిండితో ఫేస్ ప్యాక్.. ముఖంపై బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయా?
ఫిట్‌గా ఉండాలంటే ఇవి మానేయండి.. యువతకు ధోనీ ఫిట్‌నెస్ సీక్రెట్స్.
ఫిట్‌గా ఉండాలంటే ఇవి మానేయండి.. యువతకు ధోనీ ఫిట్‌నెస్ సీక్రెట్స్.
మూడో టీ20కి ముందే టీమిండియాకు భారీ ముప్పు..
మూడో టీ20కి ముందే టీమిండియాకు భారీ ముప్పు..
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు.. తల్లిదండ్రుల మాటే వేదవాక్కు..!
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు.. తల్లిదండ్రుల మాటే వేదవాక్కు..!
రోజుకొక గిన్నె తిన్నారంటే బరువు ఇట్టే తగ్గిపోతారు!
రోజుకొక గిన్నె తిన్నారంటే బరువు ఇట్టే తగ్గిపోతారు!
హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌ -2కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌
హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌ -2కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌
ఆస్పత్రిలో అలీ భార్య.. వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ కమెడియన్
ఆస్పత్రిలో అలీ భార్య.. వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ కమెడియన్
సున్నుండని మించిన శక్తి, బలం ఇచ్చే అద్భుతమైన స్వీట్!
సున్నుండని మించిన శక్తి, బలం ఇచ్చే అద్భుతమైన స్వీట్!
జట్టు నిండా డేంజర్ గాళ్లే.. ఈ రాక్షసులను ఆపకుంటే 3వ టీంలోనూ ఓటమే
జట్టు నిండా డేంజర్ గాళ్లే.. ఈ రాక్షసులను ఆపకుంటే 3వ టీంలోనూ ఓటమే