AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్ర‌పంచ వ్యాప్తంగా రోజు రోజుకీ పెరుగుతోన్న‌ క‌రోనా కేసులు

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,23,09,795కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 7,84,380 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇక‌ ప్రస్తుతం 64,71,934 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,58,37,861 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..

ప్ర‌పంచ వ్యాప్తంగా రోజు రోజుకీ పెరుగుతోన్న‌ క‌రోనా కేసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 19, 2020 | 12:10 PM

Share

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ప‌లువురు సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖులు, పోలీసులు, వైద్యులు ఈ వైర‌స్ బారిన ప‌డుతోన్న‌ విష‌యం తెలిసిందే. కాగా ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,23,09,795కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 7,84,380 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇక‌ ప్రస్తుతం 64,71,934 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,58,37,861 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్ర‌స్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 56,55,974కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 1,75,074 మంది మృతి చెందారు. కాగా 24,69,802 యాక్టీవ్ కేసులు ఉండగా, 30,11,098 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు పెరుగుతూ, త‌గ్గుతూ ఉన్నాయి.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 64,531 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1092 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,67,274కి చేరుకుంది. ఇందులో 6,76,514 యాక్టివ్ కేసులు ఉండగా.. 52,889 మంది కరోనాతో మరణించారు. అటు దేశంలో ఇప్పటివరకు 20,37,871 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

Also Read: 

న‌టి శివ పార్వ‌తికి క‌రోనా పాజిటివ్.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదంటూ ఆవేద‌న‌!

క‌రోనా బారిన ప‌డ్డ మ‌రో త‌మిళ‌నాడు మంత్రి

Follow Us
ఖరీదైన మందులతో కాదు.. డయాబెటిస్‌కు ఇదే ఏకైక బ్రహ్మాస్త్రం..!
ఖరీదైన మందులతో కాదు.. డయాబెటిస్‌కు ఇదే ఏకైక బ్రహ్మాస్త్రం..!
గుండెల్ని పిండే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని..
గుండెల్ని పిండే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని..
తిరుమల భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో వస్త్రాలు ఈ-వేలం, ఈ తేదీల్లో
తిరుమల భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో వస్త్రాలు ఈ-వేలం, ఈ తేదీల్లో
క్రెడిట్ కార్డులు వాడేవారికి అలర్ట్.. ఈ బెనిఫిట్స్ అన్నీ క్లోజ్
క్రెడిట్ కార్డులు వాడేవారికి అలర్ట్.. ఈ బెనిఫిట్స్ అన్నీ క్లోజ్
అమలాపురం రెస్టారెంట్ లో కుళ్ళిన చికెన్ బిర్యానీ
అమలాపురం రెస్టారెంట్ లో కుళ్ళిన చికెన్ బిర్యానీ
జూబ్లీహిల్స్‌లో ఫెరారీ బీభత్సం.. తుక్కుతుక్కైన మూడు కార్లు
జూబ్లీహిల్స్‌లో ఫెరారీ బీభత్సం.. తుక్కుతుక్కైన మూడు కార్లు
టమాటా ఎండు రొయ్యలు ఇలా వండితే.. ఒక్క ముద్ద కూడా వదలరు
టమాటా ఎండు రొయ్యలు ఇలా వండితే.. ఒక్క ముద్ద కూడా వదలరు
నాటి YCP ప్రభుత్వం ఏం చేసిందో క్లారిటీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
నాటి YCP ప్రభుత్వం ఏం చేసిందో క్లారిటీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
హెరిటేజ్ పై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం ఫైర్
హెరిటేజ్ పై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం ఫైర్
ఓ వైపు తల్లి మరణం.. మరోవైపు పరీక్ష..పుట్టెడు దుఃఖంలోనే హాజరైన వ
ఓ వైపు తల్లి మరణం.. మరోవైపు పరీక్ష..పుట్టెడు దుఃఖంలోనే హాజరైన వ