తెలంగాణ‌లో మ‌రో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పాజిటివ్‌

తెలంగాణ‌లో మ‌రో టీఆర్ఎస్ ఎమ్మెల్యే క‌రోనా వైర‌స్ ప‌డ్డారు. ఎల్లారెడ్డి నియోజ‌క వ‌ర్గ ఎమ్మెల్యే జాజాల సురేంద‌ర్‌కు కోవిడ్ పాజిటివ్ నిర్థార‌ణ అయింది. మంగ‌ళ‌వారం ఎమ్మెల్యేకు, కుటుంబ స‌భ్యుల‌తో పాటు అంగ‌ర‌క్ష‌కుల‌కు కూడా ప‌రీక్ష‌లు చేయించ‌గా మొత్తం ఎనిమిది మందికి..

తెలంగాణ‌లో మ‌రో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పాజిటివ్‌
Follow us

| Edited By:

Updated on: Aug 19, 2020 | 11:14 AM

తెలంగాణ‌లో మ‌రో టీఆర్ఎస్ ఎమ్మెల్యే క‌రోనా వైర‌స్ ప‌డ్డారు. ఎల్లారెడ్డి నియోజ‌క వ‌ర్గ ఎమ్మెల్యే జాజాల సురేంద‌ర్‌కు కోవిడ్ పాజిటివ్ నిర్థార‌ణ అయింది. మంగ‌ళ‌వారం ఎమ్మెల్యేకు, కుటుంబ స‌భ్యుల‌తో పాటు అంగ‌ర‌క్ష‌కుల‌కు కూడా ప‌రీక్ష‌లు చేయించ‌గా మొత్తం ఎనిమిది మందికి పాజిటివ్‌ ఉన్న‌ట్లు తేలింది. వీరిలో ఎమ్మెల్యే కూడా ఉండ‌టంతో ఆయ‌న హైద‌రాబాద్‌లోని అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మిగ‌తా వారికి కోవిడ్ ల‌క్ష‌ణాలు త‌క్కువగా ఉండ‌టంతో హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్నారు. ఇటీవ‌లే ఎమ్మెల్యే సురేంద‌ర్‌ క‌ళ్యాణ ల‌క్ష్మీ చెక్కుల పంపిణీతో పాటు ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. కాగా ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే సురేంద‌ర్ స‌హా న‌లుగురు ఎమ్మెల్యేల‌కు కోవిడ్ పాజిటివ్ తేలింది. కాగా ఇప్ప‌టికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైర‌స్ బారి నుంచి కోలుకున్న విష‌యం తెలిసిందే.

ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్త‌గా మరో 1763 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. 8 మంది వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 95,700కు చేరింది. అలాగే 719 మంది కోవిడ్ మ‌హ‌మ్మారి బారిన ప‌డి మ‌ర‌ణించారు. అలాగే ప్ర‌స్తుతం 20,990 యాక్టీవ్ కేసులు ఉండ‌గా, 73,991 మంది ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా డెత్ రేటు 0.75 శాతంగా ఉంది. దేశంలో ఇది 1.92 శాతంగా ఉందని గవ‌ర్న‌మెంట్ తెలిపింది. కాగా ఇప్పటి వరకు 7,97,470 కరోనా నిర్ధారణ టెస్టులు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

Read More:

న‌టి శివ పార్వ‌తికి క‌రోనా పాజిటివ్.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదంటూ ఆవేద‌న‌!

క‌రోనా బారిన ప‌డ్డ మ‌రో త‌మిళ‌నాడు మంత్రి

శిరసు వంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా: బ‌న్నీ