- Telugu News Photo Gallery Technology photos Amazon music introducing new AI Feature master check here for full detials
AI: మ్యూజిక్ యాప్‌ల్లోనూ ఏఐ ఫీచర్లు.. వీటి ఉపయోగం ఏంటంటే..
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం భారీగా పెరుగుతోంది. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేథ వినియోగం అనివార్యంగా మమారింది. దీంతో దాదాపు అన్ని సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నాయి. యాప్స్‌లో కూడా ఏఐ ఆధారిత ఫీచర్లను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అమెజాన్ మ్యూజిక్ యాప్‌లో ఏఐ ఫీచర్‌ను యాడ్ చేసింది..
Updated on: Apr 27, 2024 | 11:25 AM

ఇప్పటికే స్పాటిఫై ఇటీవల ప్రీమియం యూజర్ల కోసం ఏఐ ఆధారిత ప్లేలిస్ట్ జనరేటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ అమెజాన్ సైతం ఇలాంటి ఫీచర్‌నే ప్రవేశపెట్టింది. మ్యాస్ట్రో పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు.

మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్ అందుబాటులోకి రావడంతో చాలా మంది వీటినే ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ ఉంటే చాలు ఎంచక్కా ఆన్‌లైన్‌లో పాటలు వినొచ్చు. అయితే తాజాగా ఈ మ్యూజిక్ యాప్స్ పలు ఏఐ ఫీచర్లను జోడిస్తున్నాయి.

ఈ ఫీచర్ సహాయంతో ప్రాంప్ట్స్ ఆధారంగా ప్లేలిస్టును క్రియేట్ చేయటమే కాకుండా ఎమోజీలతోనూ పనిచేస్తుంది. మ్యాస్ట్రో సృష్టించిన ప్లేలిస్టును తర్వాత ఎప్పుడైనా వినాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇతరులతోనూ షేర్ చేసుకోవచ్చు.

అయితే అభ్యంతకరమైన కంటెంట్‌ను అడ్డుకోవటానికి ఇందులో ప్రత్యేక ఫీచర్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉన్న ఈ కొత్త ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఒకప్పుడు మాటలు వినాలనుకుంటే మెమోరీ కార్డులో సాంగ్స్‌ను లోడ్ చేసుకొని వినే వారు. కానీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో ఎవరికి వాళ్లే డౌన్‌లోడ్ చేసుకునే రోజులు వచ్చాయి. అయితే స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్ట్రీమింగ్ తీరే మారిపోయింది.





























