Smartphone: ఈ ఏడాది లాంచ్ అయిన కొత్త ఫోన్స్.. రూ. 20 వేల బడ్జెట్‌లో..
ప్రస్తుతం మార్కెట్లో రోజుకో కొత్త ఫోన్ సందడి చేస్తోంది. మార్కెట్లో నెలకొన్న పోటీ నేపథ్యంలో కొంగొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొత్తగా రూ. 20 వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏంటి.? ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Apr 27, 2024 | 10:57 AM

Moto G64 5G: మోటోరోలాకు చెందిన జీ64 స్మార్ట్ ఫోన్ ధర రూ. 14,999గా నిర్ణయించారు. ఇందులో 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని అందించారు. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే ఇందులో 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు.

Realme 12 5G: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ నుంచి కూడా బడ్జెట్ ఫోన్ వచ్చింది. ఈఫోన్ ధర రూ. 16,999గా ఉంది. ఇందులో మీడియాటెక్ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

Samsung Galaxy M15 5G: సామ్‌సంగ్ నుంచి అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో ఇదీ ఒకటి. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 6 జీబీ ర్యామ్ వేరియంట్‌తో తీసుకొచ్చారు. వీటి ధరలు రూ. 13,299, రూ. 14,799గా ఉన్నాయి. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

Vivo T3x 5G: వివో కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 13,499గా నిర్ణయించారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీలో అందించారు. 6.72 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. 50 ఎంపీ రెయిర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.

Realme Narzo 70 pro 5G: తక్కువ ధరలో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్ ధర రూ. 19,999గా ఉంది. ఇందులో మీడియాటెక్ చిప్‌సెస్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో ఎయిర్ గెస్చర్ ఫీచర్‌ను అందించారు.




