Samantha: అలాంటి వారు ఉండడం అదృష్టం.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

దీంతో సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత ప్రస్తుతం పూర్తి స్థాయిలో చికిత్సపైనే దృష్టిసారించారు. దీంతో కొత్త సినిమాకు సైన్‌ చేయలేరు సామ్‌. ఈ నేపథ్యంలో తాజాగా యూట్యూబ్‌ వేదికగా పాడ్‌కాస్ట్‌ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగా పలు అంశాలపై మాట్లాడుతోన్న సామ్‌ తాజాగా అభిమానుల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు...

Samantha: అలాంటి వారు ఉండడం అదృష్టం.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
Samantha
Follow us

|

Updated on: Apr 27, 2024 | 11:45 AM

నిత్యం వార్తల్లో నిలిచే నటీమణుల్లో నటి సమంత ఒకరు. అటు సినిమాలతో పాటు ఇటు వ్యక్తిగత జీవితంలోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు సామ్‌. పెళ్లి ఆపై విడాకులు, అనారోగ్య సమస్య ఇలా సామ్‌ ఇటీవల నిత్యం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నారు. మయోసైటిస్‌ అనే అరుదైన వ్ఆయధితో బాధపడుతున్న సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

దీంతో సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత ప్రస్తుతం పూర్తి స్థాయిలో చికిత్సపైనే దృష్టిసారించారు. దీంతో కొత్త సినిమాకు సైన్‌ చేయలేరు సామ్‌. ఈ నేపథ్యంలో తాజాగా యూట్యూబ్‌ వేదికగా పాడ్‌కాస్ట్‌ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగా పలు అంశాలపై మాట్లాడుతోన్న సామ్‌ తాజాగా అభిమానుల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం చిన్న విషయం కాదని చెప్పుకొచ్చారు.

ఇక తన అభిమానుల్లో చాలామందికి వినోదం, ఫ్యాషన్‌, మేకప్‌పై ఆసక్తి ఎక్కువ ఉంటుందని, వారిని చూసి ఎన్నో విషయాలపై తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు సామ్‌ తెలిపారు. కొత్త అంశాలపై అవగాహన వచ్చిందని, తన మాటలు కొద్దిమందిపై ప్రభావం చూపినా ఆనందమేన్న సమంత.. వీటి ద్వారా కొంతమందిలో అయినా మార్పు తీసుకురాగలిగితే అంతకు మించి తానేం కోరుకోను అని తెలిపారు.

సమంత లేటెస్ట్ పోస్ట్..

ఇక ఇప్పటికీ ఎక్కడో ఒకచోట తన మాటను గౌరవించే వాళ్లు ఉండడం అదృష్టమని సామ్‌ చెప్పుకొచ్చారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది సరైనదా.. కాదా అని ఆలోచిస్తానని చెప్పుకొచ్చిన సామ్‌.. మానసికంగా ప్రశాంతంగా లేకపోతే శారీరకంగా కూడా ఫిట్‌గా ఉండలేరని తెలిపారు. అందుకే తాను మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిస్తానని చెప్పుకొచ్చారు. కెరీర్ విషయానికొసస్తే సమంత ప్రస్తుతం సిటడెల్ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..