చెక్క మంచం కిర్రుమని శబ్దం చేస్తోందా..? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో సమస్యకు చెక్ పెట్టండి!
రాత్రిపూట హాయిగా నిద్రపోదామని మంచంపై పడుకున్నప్పుడు, చిన్నగా అటుఇటు కదిలినా కిర్రు కిర్రు అని శబ్దం వస్తే తీవ్రమైన విసుగు వస్తుంది. ప్రారంభంలో ఇది చిన్న సమస్యగా అనిపించినప్పటికీ, రోజువారీ నిద్రను, ప్రశాంతతను దూరం చేస్తుంది. పెద్ద చిరాకు తెప్పిస్తుంది. ఈ సమస్య రాగానే చాలామంది మంచం పాతబడిపోయిందని భావించి కొత్తది కొనాలని ఆలోచిస్తుంటారు. కానీ, మంచం మర్చాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే లభించే కొన్ని వస్తువులతో ఈ కిర్రు శబ్దాలకు సులభంగా స్వస్తి చెప్పవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

రాత్రివేళ నిద్రపోతున్నప్పుడు లేదా పక్కపై అటుఇటు తిరిగినప్పుడు చెక్క మంచం నుండి కిర్రుమని శబ్దం రావడం తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇది ప్రశాంతమైన నిద్రను పాడుచేస్తుంది. అయితే దీనికోసం కొత్త మంచం కొనాల్సిన అవసరం లేదు.. కొన్ని ఇంట్లోనే చేసుకునే సులభమైన చిట్కాలతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు. మంచం బాగుచేసే ముందు శబ్దం ఎక్కడి నుండి వస్తోందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా పరుపును పక్కన పెట్టి, మంచం ఫ్రేమ్, సపోర్ట్ పటకలపై వేర్వేరు చోట్ల చేత్తో ఒత్తిడి తెస్తూ కదిలించి చూడండి. దీనివల్ల శబ్దం ఏ మూల లేదా ఏ జాయింట్ వద్ద నుండి వస్తోందో స్పష్టంగా తెలుస్తుంది.
చెక్క మంచాలు శబ్దం చేయడానికి అత్యంత సాధారణ కారణం వాటి జాయింట్లు వదులవడం. చాలా కాలం వాడటం వల్ల స్క్రూలు, బోల్టులు వదులై చెక్క భాగాలు ఒకదానికొకటి రాపిడికి గురై శబ్దం చేస్తాయి. స్క్రూడ్రైవర్ లేదా స్పాన్నర్ సహాయంతో మంచం అన్ని మూలల్లో ఉన్న బోల్టులను గట్టిగా బిగించండి. తరచుగా ఈ ఒక్క పనిచేస్తేనే శబ్దం పూర్తిగా తగ్గిపోతుంది.
స్క్రూలు బిగించిన తర్వాత కూడా శబ్దం వస్తుంటే, రెండు చెక్క భాగాల మధ్య ఉండే రాపిడి కారణం కావచ్చు. వాతావరణంలో తేమ మారడం వల్ల కూడా చెక్క వ్యాకోచించి ఈ సమస్య వస్తుంది. ఇటువంటి సమయంలో శబ్దం వచ్చే జాయింట్ల వద్ద కొవ్వొత్తి మైనాన్ని రుద్దాలి. ఇది లూబ్రికెంట్‌గా పనిచేసి రాపిడిని తగ్గించి శబ్దాన్ని నివారిస్తుంది.
మంచం ఫ్రేమ్‌పై వేసే చిన్న చెక్క పటకలు కదిలినప్పుడు కూడా శబ్దం వస్తుంది. ఇవి ఫ్రేమ్‌ను తాకే చోట పాత కాటన్ బట్ట, టవల్ ముక్కలు లేదా సన్నని ఫోమ్ ప్యాడ్లను అమర్చాలి. ఇది రెండు చెక్క ఉపరితలాల మధ్య కుషన్ లాగా పనిచేసి శబ్దం రాకుండా చూస్తుంది.
కొన్నిసార్లు సమస్య మంచంలో కాకుండా గది నేల అసమానంగా ఉండటంలో ఉంటుంది. నేల సమతలంగా లేకపోతే మంచం ఒకవైపునకు వంగి ఆడటం వల్ల శబ్దం వస్తుంది. మంచం కాళ్ల కింద మందపాటి బట్ట ముక్కలు లేదా ప్యాడ్లను ఉంచి మంచం స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. ఈ చిన్న చిన్న గృహ చిట్కాలను పాటించడం ద్వారా మీ చెక్క మంచం శబ్దాలను అరికట్టి, ప్రశాంతమైన రాత్రి నిద్రను మళ్లీ సొంతం చేసుకోవచ్చు.