నేపాల్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదు.. తాజా అప్డేట్స్‌ ఇవే..

పొరుగు దేశం నేపాల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు వందల్లో ఉన్న కేసుల సంఖ్య ఇప్పుడు రెండు వేల మార్క్‌ను దాటింది.

నేపాల్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదు.. తాజా అప్డేట్స్‌ ఇవే..
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2020 | 8:41 PM

పొరుగు దేశం నేపాల్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు వందల్లో ఉన్న కేసుల సంఖ్య ఇప్పుడు రెండు వేల మార్క్‌ను దాటింది. తాజాగా మంగళవారం రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 288 కరోన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,099కి చేరింది. అంతుకు ముందు సోమవారం నాడు.. 226 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 266 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో ఎనిమిది మంది కరోనా బారినపడి మరణించారు. ఈ విషయాన్ని నేపాల్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక మంగళవారం నమోదైన 288 కొత్త కేసుల్లో 270 మంది పురుషులు కాగా, 18 మంది స్త్రీలు ఉన్నట్లు తెలిపారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోన పాజిటివ్ కేసుల సంఖ్య 6,294,222కి చేరింది. వీరిలో కరోనా బారినపడి 3,76,077 మంది మరణించారు.